ఎంపీడీఓ కార్యాలయం ఎదుట మహిళా పోలీస్ నిరసన
పెనుగంచిప్రోలు: తనను విధుల పరంగా వేధిస్తున్నారంటూ మండలంలోని వెంకటాపురం గ్రామానికి చెందిన మహిళా పోలీస్ తేజశ్రీ శనివారం స్థానిక మండల పరిషత్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేసింది. గ్రామ పంచాయతీ కార్యదర్శి కృష్ణ తనను పని పరంగా ఒత్తిడి చేస్తున్నారని, తనకు ఆరోగ్యం బాగోలేదని చెప్పినా అదనపు విధులు చేయాలని వేధిస్తున్నారని, షోకాజ్ నోటీస్ కూడా ఇచ్చారన్నారు. ఆరోగ్యం బాగోక మెడికల్ లీవ్ పంపినా ఎంపీడీఓ కార్యాలయంలో ఎవరూ తీసుకోలేదని తెలిపింది. ఎంపీడీఓ కార్యాలయంలో లేకపోవటంతో వచ్చే వరకు ఉంటానని అక్కడే కూర్చుంది. విషయం తెలుసుకున్న పోలీస్ సిబ్బంది, ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది వచ్చి ఆమెతో మాట్లాడి ఒప్పించడంతో అక్కడ నుంచి కదిలివెళ్లింది. దీనిపై పంచాయతీ కార్యదర్శి కృష్ణను వివరణ కోరగా తాను పై అధికారుల సూచనల మేరకే ఉద్యోగ విధులు చెబుతున్నానని, ఎటువంటి వేధింపులకు గురి చేయలేదని సమాధానమిచ్చారు.
సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య బందరు కాలువలో దూకిన వ్యక్తి మృతి పెనమలూరు: బందరు కాలువలో దూకి గల్లంతైన వ్యక్తి మృతదేహాన్ని శనివారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పెనమలూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గంగూరుకు చెందిన మహమ్మద్ నజీర్(44)కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. అతను వడ్రంగి పని చేస్తాడు. అయితే నజీర్ మద్యానికి బానిసగా మారటంతో భార్యభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవి. నజీర్ భార్య నజీర్ సోదరుడు ఖాదిర్‌కు ఫోన్ చేసి భర్తతో గొడవల విషయం చెప్పింది. దీంతో ఖాదిర్ యనమలకుదురు నుంచి గురువారం ఉదయం గంగూరుకు బయలుదేరాడు. ఈ లోగా నజీర్ ఖాదిర్‌కు ఫోన్ చేసి తాను పెనమలూరు వంతెన వద్ద ఉన్నానని, కాలువలో దూకుతున్నానని చెప్పాడు. ఖాదిర్ వెంటనే పెనమలూరు వంతెన వద్దకు వెళ్లగా, అప్పటికే వంతెన పైనుంచి నజీర్ కాలువలో దూకాడు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగి బందరు కాలువలో నజీర్ కోసం గాలింపు చేపట్టారు. ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది రెండు రోజులుగా బందరు కాలువలో గాలించగా చివరకు గంగూరు వద్ద నజీర్ మృతదేహం లభ్యమయింది. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం పంపారు.
ట్రావెల్స్ బస్సు ఢీకొని
చిరు వ్యాపారి దుర్మరణం
ఎ.కొండూరు: మండల పరిధిలోని కేశ్యా గ్రామ పంచాయతీలోని తండాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు పాల్పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. వివరాలు... కేశ్యాతండాకు చెందిన భరోతు రవి కుమార్ (35)కు భార్య, ఒక కుమార్తె ఉన్నారు. కుటుంబ కలహాలతో భార్య కాపురానికి రాకపోవడంతో, ఈనెల 2వ తేదీన పురుగు మందు తాగి బలవన్మరణానికి యత్నించాడు. అంతకు ముందు అతను ఒక సెల్ఫీ వీడియో తీసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆత్మహత్యాయత్నం గమనించిన వెంటనే కుటుంబ సభ్యులు రవి కుమార్‌ను చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గత రెండురోజులుగా అక్కడ మృత్యువుతో పోరాడిన రవికుమార్ శనివారం పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచాడు. రవికుమార్ మృతితో తండాలో విషాద ఛాయలు అలముకున్నాయి. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మహాలక్ష్మణుడు తెలిపారు.
నందిగామరూరల్: ఓ చిరు వ్యాపారి టీవీఎస్‌పై వెళుతుండగా వెనుక నుంచి వేగంగా వస్తున్న ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో తీవ్రగాయాలై మృతి చెందిన ఘటన శనివారం జరిగింది. పోలీసుల కథనం మేరకు చందర్లపాడు మండలం తోటరాములపాడు గ్రామానికి చెందిన కోట స్వామి(59) నిత్యం ఓ టీవీఎస్‌పై చిరు వ్యాపారం చేస్తుంటాడు. శనివారం తెల్లవారుజామున ఇంటి నుంచి కంచికచర్లకు బయలుదేరి కీసర సమీపంలోకి రాగానే హైదరాబాద్ వైపు నుంచి విజయవాడ వైపునకు వెళుతున్న ఓల్వా బస్సు వెనుక నుంచి వచ్చి బలంగా ఢీకొంది. ఈ ఘటనలో స్వామికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న నేషనల్ హైవే అంబులెన్స్ వాహన సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని వైద్య చికిత్స కోసం నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. విషయం తెలుసుకున్న భార్య సీతామహాలక్ష్మితో పాటు ఇద్దరు కుమార్తెలు కన్నీరు మున్నీరుగా విలపించారు.