14 నుంచి నెట్‌బాల్ టోర్నీ
14 నుంచి నెట్‌బాల్ టోర్నీ మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ నెట్‌బాల్ (మహిళల)టోర్నమెంట్ ఫిబ్రవరి 14 నుంచి 18వ తేదీ వరకు విజయవాడలోని స్టెల్లా కళాశాల మైదానంలో నిర్వహిస్తున్నామని కృష్ణా యూనివర్సిటీ వీసీ కోన రాంజీ చెప్పారు. నగరంలోని స్టెల్లా కళాశాల ఆవరణలో విలేకరుల సమావేశం ఆదివారం జరిగింది. రాంజీ మాట్లాడుతూ న్యూఢిల్లీలోని అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్(ఏఐయూ) వారు 2025–26 విద్యాసంవత్సరానికి ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ నెట్‌బాల్ (మహిళల) టోర్నమెంట్ నిర్వహణ బాధ్యతలను తమ వర్సిటీకి అప్పగించించారన్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన యూనివర్సిటీల నుంచి ఇప్పటి వరకు 79 టీమ్‌లు రిజిస్టర్ చేసుకున్నాయన్నారు. మొత్తం వెయ్యి మందికిపైగా క్రీడాకారులు, 160 మందికి పైగా కోచ్‌లు, ఇతర సిబ్బంది పాల్గొంటారన్నారు. వర్సిటీ రెక్టార్ బసవేశ్వరరావు, స్టెల్లా కళాశాల ప్రిన్సిపాల్ ఇన్యాసమ్మ పాల్గొన్నారు. బాడీ బిల్డింగ్
క్రీడాకారుల ఎంపిక పెనమలూరు: ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన బాడీబిల్డింగ్ క్రీడాకారులను పలుపోటీలకు ఎంపిక చేశామని బాడీ బిల్డింగ్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు బి.మనోహర్, తాళ్లూరి అశోక్, ఉపాధ్యక్షుడు సీహెచ్ రాజు తెలిపారు. కానూరులో ఆదివారం జరిగిన కార్యక్రమంలో వివరాలు తెలుపుతూ కరీమ్‌నగర్‌లో వచ్చే నెల 7, 8 తేదీలలో జరగనున్న జూనియర్ బాడీబిల్డింగ్ పోటీలకు రాష్ట్ర జట్టుకు అఖిల్(60కేజీలు), ఉదయ్(61కేజీలు) జానకీరామ్(71కేజీలు), గోపీచంద్(71కేజీలు) ఎంపికయ్యారన్నారు.
వెస్ట్ బెంగాల్‌లో వచ్చే నెల 13, 14 తేదీల్లో జరగనున్న ఫెడరేషన్ కప్ పోటీలను జిల్లా జట్టు ఎంపిక చేశామన్నారు. ఎం.దినేష్(60 కేజీలు), యేసు(65 కేజీలు), జీవిద్(65 కేజీలు), శివనాగప్రశాంత్(65 కేజీలు), అజయ్‌బాబు(70 కేజీలు), వంశీ(75 కేజీలు), మహ్మద్ సలామ్ (75 కేజీలు) ఎంపిక చేశామని తెలిపారు. ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 31వ తేదీన జరగనున్న రాష్ట్ర సెలక్షన్స్‌లలో పాల్గొంటారని అన్నారు. మేనేజర్‌గా అల్లూరిరెడ్డి, కోచ్‌గా దుర్గాప్రసాద్ వ్యవహరిస్తారని తెలిపారు. దుర్గమ్మ సన్నిధిలో
రథసప్తమి వేడుకలు
జూనియర్ నేషనల్స్‌కు..
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): మాఘ సప్తమి(రథ సప్తమి)ని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో సూర్యభగవానుడికి ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని రాజగోపురం వద్ద సూర్యభగవానుడి విగ్రహానికి విశేష అలంకరణ, పూజా కార్యక్రమాలను నిర్వహించారు. సూర్య నమస్కారాలు, సూర్యోపాసన సేవలను నిర్వహించగా పెద్ద ఎత్తున ఉభయదాతలు పాల్గొని తమ నామగోత్రాలతో పూజలు జరిపించారు. ఆలయ ఈవో శీనానాయక్, చైర్మన్ రాధాకృష్ణలతో పాటు ట్రస్ట్ బోర్డు సభ్యులు పాల్గొన్నారు.
1/1
14 నుంచి నెట్‌బాల్ టోర్నీ