ముగిసిన రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు
చాంపియన్‌గా విజయనగరం, రెండో స్థానంలోఎన్టీఆర్ జట్టు
వీరవాసరం: దివంగత కొల్లా భాస్కరమ్మ, గుండా లక్ష్మీ రత్నావతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వీరవాసరంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి కబడ్డీ చాంపియన్‌షిప్ పోటీలు మంగళవారం ముగిశాయి. 25 జిల్లాల నుంచి వచ్చిన కబడ్డీ జట్లు అత్యద్భుత ప్రదర్శనలు ఇవ్వగా విజయనగరం జిల్లా జట్టు మొదటి స్థానం సాధించి విజేతగా నిలిచింది. 2వ స్థానంలో ఎన్టీఆర్ జిల్లా, 3వ స్థానంలో కృష్ణా, అనంతపురం (కంబైన్డ్) జట్లు నిలిచాయి. విజేతలకు రాజ్యసభ సభ్యుడు పాకా వెంకట సత్యనారాయణ ట్రోఫీలను అందజేశారు. కార్యక్రమంలో గుండా జయప్రకాష్ నాయుడు, గుండా రామకృష్ణ, వీరవల్లి చంద్రశేఖర్, బాజింకి గంగా మహేష్, కారింశెట్టి మూర్తి, ఆకుల లీలాకృష్ణ, వేండ్ర దివాకర్, కురెళ్ల నరసింహారావు పాల్గొన్నారు.


