విజయవాడ సిటీ
న్యూస్‌రీల్
వైద్య విద్య అందకుండా పోతుంది
ఎన్టీఆర్ జిల్లా
శుక్రవారం శ్రీ 19 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఘన స్వాగతం
నాగాయలంక: మాస శివరాత్రి సందర్భంగా స్థానిక శ్రీరామ పాద క్షేత్రంలోని పుష్కర ఘాట్ వద్ద ఉన్న గంగ, పార్వతి సమేత రామలింగేశ్వరస్వామికి గురువారం ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు.
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడంలేదు. దిగువకు 2,400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రాజెక్టులో ప్రస్తుత నీటి నిల్వ 41.9308 టీఎంసీలు.
గుడివాడటౌన్: ఏఎన్నార్ కాలేజీ వజ్రోత్సవాలు గురు వారం ఘనంగా ముగిశాయి. మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ తదితరులు పాల్గొన్నారు.
సాక్షి ప్రతినిధి, విజయవాడ/వన్‌టౌన్(విజయవాడ పశ్చిమ):వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి విజయవాడలో గురువారం ఘన స్వాగతం లభించింది. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయానికి నిరసనగా వైఎస్సార్ సీపీ చేపట్టిన కోటి సంతకాల ఉద్యమానికి మద్దతుగా తరలివచ్చిన ప్రజలు జననేతకు సంఘీభావం తెలిపారు. ప్రైవేటీకరణపై వెల్లువెత్తుతున్న ప్రజాగ్రహాన్ని కోటి సంతకాల రూపంలో గవర్నరకు తెలియజేయడానికి అభిమాన నేత నగరానికి చేరుకోవటంతో పార్టీ శ్రేణులతో పాటుగా భారీగా తరలివచ్చిన ప్రజలు, అభిమానులు బ్రహ్మరథం పట్టి సంపూర్ణ మద్దతు తెలిపారు.
నేతాజీ వంతెన నుంచి
అంబేడ్కర్ స్మృతి వనం వరకు..
వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న నేతాజీ వంతెన వద్ద వేలాది మంది వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి స్వాగతం పలికారు. ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు స్వచ్ఛందంగా తరలివచ్చిన ప్రజలు నీరాజనాలు పలికారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కారు నుంచి బయటకు వచ్చి అందరికీ అభివాదం చేశారు. వందలాది కార్లు, వేలాది ద్విచక్ర వాహనాలతో భారీ సంఖ్యలో ప్రజలు వెంటరాగా పశువుల ఆస్పత్రి సెంటర్ వద్ద బందరు రోడ్డులోకి జననేత కాన్వాయ్ ప్రవేశించింది. అక్కడి నుంచి బందరు రోడ్డు మీదుగా డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ స్మృతి వనం వద్దకు చేరుకుంది.
రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళి
డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ స్మృతి వనం వద్ద పార్టీ నాయకులతో కలిసి అంబేడ్కర్ విగ్రహానికి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. ప్రభుత్వ వైద్య కళాశాలలను అడ్డగోలుగా ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటూ పార్టీ శ్రేణులు నినదించాయి. అక్కడి నుంచి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి చంద్రబాబు ప్రభుత్వం పీపీపీ పేరుతో చేపట్టిన ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజల నుంచి సేకరించిన కోటి సంతకాల ప్రతులను గవర్నర్‌కు అందించేందుకు తరలివెళ్లారు. దారి పొడవునా జై జగన్.. జైజై జగన్ అన్న నినాదాలు మిన్నంటాయి.
అడుగడుగనా ఆంక్షలు..
నగరంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన సంద ర్భంగా అడుగడుగునా ఆంక్షలు విధించారు. బందరురోడ్డు పరిసరాల్లో పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. అంబేడ్కర్ స్మృతి వనం నుంచి గవర్నర్ బంగ్లాకు జగన్ కాన్వాయ్ వెళ్లేందుకు, పోలీసులు బారికేడ్లు పెట్టి ఇబ్బందులు పెట్టారు. జననేత వెంట జనం ముందుకు సాగకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి, ఆంక్షలు విధిస్తూ ఎటూ వెళ్లడానికి లేకుండా పోలీసులు అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేశారని పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అయినప్పటికీ సుమారు మూడు గంటల పాటు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని వేలాది మంది ప్రజలు అనుసరించారు. ఈ కార్యక్రమంలో శాసన మండలిలో ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, మొండితోక అరుణకుమార్, రుహుల్లా, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, వెలంపల్లి, మల్లాది విష్ణు, పలువురు మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్టీ జిల్లాల అధ్యక్షులు, పార్టీ వివిధ విభాగాలకు చెందిన నేతలు పాల్గొన్నారు.
7
ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేసేందుకు తీసుకున్న చర్యలు దారుణం. పేద, మధ్య తరగతి వర్గాల విద్యార్థులకు రానున్న రోజుల్లో వైద్య విద్య అందకుండాపోతుంది. ప్రభుత్వం తక్షణం ప్రైవేటీకరణ చర్యలు ఉపసంహరించుకోవాలి. పేద, మధ్య తరగతి విద్యార్థుల ప్రయోజనాలు కాపాడాలి. వారికి వైద్య విద్యను చేరువ చేయాలి.
– కై లా భరత్ భూషణ్, బీఎస్సీ విద్యార్థి, యనమలకుదురు,
పెనమలూరు మండలం
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ


