విద్యాహక్కు చట్టంలో సవరణ తీసుకురావాలి
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): సర్వీస్‌లో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇచ్చేలా విద్యాహక్కు చట్టంలో సవరణ చేయాలని మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసు కురావాలని కోరారు. ఉపాధ్యాయుల సమస్యలను తక్షణం పరిష్కరిచాలని కోరుతూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నాచౌక్‌లో గురువారం ఉపాధ్యాయులు ధర్నా చేశారు. కె.ఎస్.లక్ష్మణరావు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం విద్యాహక్కు చట్టం 2009 క్లాజ్ 23(2) సవరణ చేసి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని సూచించారు. ఈ విషయంలో విద్యాశాఖ మంత్రి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు తప్పని సరిగా టెట్ రాయాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చి ఇప్పటికీ నాలుగు నెలలైనా, రాష్ట్ర ప్రభుత్వం తరుఫున రివ్యూ పిటీషన్ వేయకపోవటాన్ని తప్పుపట్టారు. వెంటనే కోర్టులో రివ్యూ పిటీషన్ వేయాలని డిమాండ్ చేశారు. యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.పి.మనోహర్ కుమార్, జిల్లా ప్రధాన కార్య దర్శి సుందరయ్య మాట్లాడుతూ.. ఆప్షన్ హాలిడే విని యోగించుకోవడంలో, రెండో శనివారం సెలవులు, ఏకోపాధ్యా యులు ఓహెచ్, ఇతర సెలవులు వినియోగించుకోవడంలో అధికారుల మొండిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. జిల్లా అధ్యక్షుడు కె.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. విజయవాడ కార్పొరేషన్ పరి ధిలో సబ్జెక్ట్ టీచర్ల కొరత తీర్చాలని డిమాండ్ చేశారు.
మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు


