రేపు మధుమేహంపై జాతీయ సదస్సు | - | Sakshi
Sakshi News home page

రేపు మధుమేహంపై జాతీయ సదస్సు

Dec 13 2025 7:23 AM | Updated on Dec 13 2025 7:23 AM

రేపు మధుమేహంపై జాతీయ సదస్సు

రేపు మధుమేహంపై జాతీయ సదస్సు

లబ్బీపేట(విజయవాడతూర్పు): ఆంధ్రప్రదేశ్‌ డయాబెటీస్‌ ఫెడరేషన్‌ (ఏపీడీఎఫ్‌కాన్‌–2025), ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌(ఐఎంఏ) సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 14న విజయవాడలో సదస్సు నిర్వహించనున్నట్లు ఏపీడీఎఫ్‌కాన్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ యలమంచి సదాశివరావు తెలిపారు. ఈ సందర్భంగా సూర్యారావుపేటలోని తమ ఆస్పత్రిలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సదస్సుకు సంబంధించిన బ్రోచర్‌ను ఆవిష్కరించారు. అనంతరం డాక్టర్‌ సదాశివరావు మాట్లాడుతూ.. లబ్బీపేటలో హోటల్‌ జీఆర్‌టీ గ్రాండ్‌లో నిర్వహించే ఈ సదస్సులో దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన 500 మంది నిపుణులు పాల్గొంటారని, 20 మంది జాతీయ వక్తలు ప్రసంగిస్తారని తెలిపారు. మధుమేహంతో శరీరంలోని గుండె, కిడ్నీ వంటి అవయవాలపై ప్రభావం చూపుతాయని, కొత్తగా వచ్చే మందులు ఆ అవయవా లను కాపాడతాయని పేర్కొన్నారు. కొత్త మందులు, ఒబెసిటీతో ప్రభావం వంటి అనేక కీలక అంశా లను చర్చించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సదస్సు జాయింట్‌ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ డాక్టర్‌ యలమంచి ఐశ్వర్య, డాక్టర్‌ హిమన, డాక్టర్‌ అమూల్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement