విస్సన్నపేట ఎంపీపీ ఎన్నిక ఏకగ్రీవం
విస్సన్నపేట: విస్సన్నపేట ఎంపీపీ ఎన్నిక వెలుగు కార్యాలయంలో గురువారం నిర్వహించారు. ఎంపీపీగా 6వ సెగ్మెంట్ ఎంపీటీసీ సభ్యుడు గద్దల మల్లయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్డీఓ కె.మాధురి, అబ్జర్వర్‌గా జేసీ ఎస్.ఇలక్కియా వ్యవహరించారు. ఏకగ్రీవంగా ఎన్నికై న ఎంపీపీతో ఆర్డీవో ప్రమాణస్వీకారం చేయించి ధ్రువీకరణ పత్రం అందజేశారు. తహసీల్దార్ కె.లక్ష్మీకళ్యాణి, ఎంపీడీఓ చేకు చిన్నరాట్నాలు, ఎస్‌ఐ రామకృష్ణ, ఎంపీటీసీ సభ్యులు, కో ఆప్షన్ సభ్యుడు పాల్గొన్నారు.
మల్లయ్యకు అభినందనలు
గద్దల మల్లయ్యను వైఎస్సార్ సీపీ నాయకులు మండలంలోని పుట్రేల గ్రామంలో పార్టీ రాష్ట్ర నాయకుడు మద్దిరెడ్డి సూర్యనారాయణరెడ్డి నివాసం వద్ద గురువారం అభినందనలు తెలిపారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, విజయవాడ పార్లమెంట్ పరిశీలకుడు మోదుగుల వేణుగోపాలరెడ్డి, తిరువూరు నియోజకవర్గ ఇన్‌చార్జి నల్లగట్ల స్వామిదాసు, నియోజకవర్గ అబ్జర్వర్ తంగిరాల రామిరెడ్డి,స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మద్దిరెడ్డి సూర్యనారాయణరెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు భీమిరెడ్డి లోకేశ్వరరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు ఓలేటి దుర్గారావు, పట్టణ అధ్యక్షుడు నెక్కళపు కుటుంబరావు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.


