వక్ఫ్ ఆస్తుల నమోదుకు మరింత సమయం కోరండి
లబ్బీపేట(విజయవాడతూర్పు): వక్ఫ్ ఆస్తుల నమోదుకు మరింత సమయం కోసం ట్రిబ్యూనల్‌ను ఆశ్రయించాలని కోరుతూ ముస్లిం జేఏసీ నాయకులు బుధవారం వక్ఫ్‌బోర్డు సీఈఓ మహమ్మద్ అలీని కలిసి వినతిపత్రం అందజేశారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల వక్ఫ్ బోర్డులు ట్రిబ్యూనల్‌ను ఆశ్రయించా యని పేర్కొన్నారు. ముస్లిం జేఏసీ కన్వీ నర్ మునీర్ అహ్మద్ షేక్ ఆధ్వర్యంలో పలువురు ప్రతినిధులు వక్ఫ్‌బోర్డు సీఈఓను కలిసి సమస్యను వివరించారు. వక్ఫ్ చట్టం తీసుకొచ్చిన సమయంలో ఆరు నెలల్లో ఉమిద్ పోర్టల్‌లో ఆస్తులు నమోదు చేయాలని కేంద్రం సూచించిందన్నారు. ఈ నెల ఆరో తేదీతో ఆ గడువు ముగిసినా చాలా ఆస్తులను ఉమిత్ పోర్టల్‌లో నమోదు చేయలేదని వివరించారు. ట్రిబ్యూనల్ కర్నూలులో ఉందని, శాశ్వత జడ్జి లేనందున రోజు వారీ విచారణ జరగటం లేదని పేర్కొ న్నారు. వక్ఫ్ సీఈఓను కలిసిన వారిలో ముస్లిం అడ్వికేట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అబ్దుల్ మతీన్, మజ్లీసుల్ ఉలేమా అధ్యక్షుడు ముఫ్తీ యూసఫ్ అలీ, నసీర్ ఉమ్రీ, ముఖ్తార్ అలీ తదితరులు ఉన్నారు.


