వడ్డమానులో మంత్రి నారాయణ పర్యటన
తాడికొండ: రెండో విడత భూసమీకరణలో భాగంగా పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తుళ్లూరు మండలం వడ్డమానులో బుధవారం పర్యటించారు. స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, సీఆర్డీఏ అడిషనల్ కమిషనర్ ఎ.భార్గవ్‌తేజతో కలిసి రైతులతో సమావేశం నిర్వహించి అభిప్రా యాలు సేకరించారు. రైతులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకుడు పూర్ణచంద్రరావు మాట్లాడుతూ.. తాము భూములిస్తే ఎన్ని రోజుల్లో అభివృద్ధి చేసి రిటర్నబుల్ ప్లాట్లు ఇస్తారని ప్రశ్నించారు. మూడేళ్లలో అభివృద్ధి చేసి ఇస్తానని మంత్రి తెలుపగా సమయానికి ఇవ్వకపోతే ఏడాదికి రూ.5 లక్షలు రైతులకు చెల్లించేలా బాండ్ ఇవ్వాలని కోరారు.


