విస్తృతంగా కోటి సంతకాల సేకరణ
ఎన్టీఆర్ జిల్లాలో 4.31 లక్షలకు చేరిన సంతకాలు
లబ్బీపేట(విజయవాడతూర్పు): నూతన వైద్య కళాశాలలను పీపీపీ పేరుతో ప్రైవేటీకరణ చేయడంపై వైఎస్సార్ సీపీ చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమం విస్తృతంగా కొనసాగుతోంది. ప్రతి నియోజకవర్గంలో 60 వేలు సంతకాలు సేకరించాలని భావించగా, ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో లక్ష్యానికి మించి సంతకాలు సేకరణ జరిగాయి. ఇంకా ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. వైద్య కళాశాలలపై చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సంతకాలు చేస్తున్నారు. భావి తరాల భవిష్యత్‌కు వైద్య కళాశాలలు ప్రభుత్వం ఆధీనంలోనే ఉండాలంటున్నారు. ఆదివారం నాటికి 4.15 లక్షల సంతకాలు సేకరించగా, సోమవారం మరో 15,775 సంతకాలు సేకరించారు. దీంతో ఎన్టీఆర్ జిల్లాలో ఇప్పటి వరకూ 4,31,595 సంతకాలు సేకరించినట్లయిది. నియోజకవర్గాల వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జిల నేతృత్వంలో కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతోంది.
సేకరణ ఇలా..


