ఐఎంఏ అధ్యక్షుడిగా వరప్రసాద్ బాధ్యతల స్వీకరణ
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఇండియన్ మెడికల్ అసోసియేషన్ విజయవాడశాఖ 2025–26 నూతన కార్యవర్గం ఆదివారం బాధ్యతలు స్వీకరించింది. గవర్నర్‌పేటలోని ఐఎంఏ హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకూ అధ్యక్షుడిగా వ్యవహరించిన డాక్టర్ బోడేపూడి హనుమయ్య నుంచి నూతన అధ్యక్షుడిగా డాక్టర్ వీఎన్ వరప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. ఉపాధ్యక్షులుగా డాక్టర్ ఎస్‌బీఎన్ చౌదరి, డాక్టర్ ఉప్పులేటి తారకప్రసాద్, కార్యదర్శిగా డాక్టర్ అనూప్ తోట, సంయుక్త కార్యదర్శులుగా డాక్టర్ ఏ సూర్యనారాయణరావు, డాక్టర్ ఎం. పూజిత, కోశాధికారిగా డాక్టర్ కె. వంశీకృష్ణ బాధ్యతలు తీసుకున్నారు. మరో 20 మంది కార్యవర్గ సభ్యులుగా నూతన కమిటీలో ఉన్నారు. డాక్టర్ వీఎన్ వరప్రసాద్ మాట్లాడుతూ ఐఎంఏ విజయవాడ శాఖ ప్రతిష్టను మరింత ఇనుమడింపజేయడంతో పాటు, కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తామన్నారు.


