జాతీయ స్థాయి కరాటే పోటీల్లో అన్వర్‌కు గోల్డ్ మెడల్
భవానీపురం(విజయవాడపశ్చిమ): నేషనల్ ఓపెన్ కరాటే చాంపియన్‌షిప్ – 2025 పోటీల్లో కటా విభాగంలో బ్లూ బెల్ట్ కేటగిరీలో ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ న్యాయవాది డాక్టర్ షేక్ అన్వర్ బంగారు పతకాన్ని సాధించారు. వరల్డ్ కరాటే ఫెడరేషన్ ఆధ్వర్యంలో సిట్రోరియోకాయ్ ఇంటర్నేషనల్ కరాటే డో అకాడమీ ఇండియా ఆదివారం గుంటూరు ఎన్టీఆర్ స్టేడియంలో 23వ జాతీయ స్థాయి ఓపెన్ కరాటే పోటీలు జరిగాయి. ఇందులో పాల్గొన్న షేక్ అన్వర్ కటా విభాగంలో గోల్డ్ మెడల్ సాధించారు. ఈ సందర్భంగా టోర్నమెంట్ చీఫ్ ఆర్గనైజర్ సురేష్(బ్లాక్ బెల్ట్ నైన్త్ డాన్ ఇండియా జె.హరినాథ్ (జేకే గోజురియో కరాటే అకాడమీ), జక్కుల దినేష్, మధు, మహేష్ అన్వర్‌ను సత్కరించి బంగారు పతకాన్ని ప్రదానం చేశారు. అనంతరం గోల్డ్ మెడల్ అవార్డ్ గ్రహీత డాక్టర్ షేక్ అన్వర్ మాట్లాడుతూ గత 19 ఏళ్లుగా కరాటే విద్యలో శిక్షణ తీసుకుంటున్నానని తెలిపారు. కరాటేను సెల్ఫ్ డిఫెన్స్‌గా మాత్రమే పరిగణించాలని, జీవితంలో ఎదగడానికి, ధృడ నిర్ణయాలు తీసుకోవడానికి కరాటే ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. కరాటేను ఒలంపిక్స్‌లో ప్రవేశపెట్టడం తమలాంటివారికి శుభపరిణామమని పేర్కొన్నారు.


