రబీకి ఎరువులు సిద్ధం
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): సన్నద్ధత చర్యల్లో భాగంగా రబీ సీజన్‌కు అవసరమైన వివిధ రకాల ఎరువులను సిద్ధంగా ఉంచుతున్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియతో కలిసి జిల్లాలో రబీకి ఎరువుల అవసరం, లభ్యత, ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్ లక్ష్మీశ శనివారం మీడియాతో మాట్లాడారు. రబీలో 33,765 హెక్టార్లలో వివిధ పంటల సాగు జరు గుతుందన్న అంచనాలకు అనుగుణంగా ఎరువుల సరఫరా ప్రణాళికను అమలుచేస్తున్నా మని తెలిపారు. డిసెంబర్ నెలకు 17,812 టన్నుల ఎరువులు అవసరం ఉండగా ప్రస్తుతం 27,542 టన్నుల ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. రైతులు భూసార పరీక్షల కార్డుల ఆధారంగా, అధికారుల సూచనలు మేరకు, శాసీ్త్రయ దృక్పథంతో ఎరువులను ఉపయోగించాలని పేర్కొన్నారు. ఎరువుల విషయంలో అపోహ లను నమ్మకుండా ఏ సమాచారం కావాలన్నా కలెక్టరేట్ కమాండ్ కంట్రోల్ రూమ్‌కు కాల్ చేయా లని సూచించారు. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ముమ్మరంగా సాగుతోందని తెలిపారు.


