జీర్ణకోశ వ్యాధులు..
మా వద్దకు తరచూ బయటి ఆహారం తినడం వల్ల ఫుడ్ పాయిజన్‌కు గురైన వారు వస్తుంటారు. అంతేకాదు ఇటీవల కాలంలో అన్ని వయస్సుల వారు జీర్ణకోశ వ్యాధులకు గురవుతున్నారు. అందుకు ఆహార నియమాలు పాటించక పోవడం, బయటి ఆహారం తినడమే కారణం. సురక్షితం కానీ ఆహారం తినడం మానుకోవాలి. సింథటిక్ రంగులు కలిసిన ఆహారం తినడం వల్ల జీర్ణకోశ వ్యాధులు ప్రబలి, అవి దీర్ఘకాలంలో క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదం ఉంది. జాగ్రత్త పడాలి.
– డాక్టర్ చింతా వీర అభినవ్, గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, విజయవాడ


