తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
చిల్లకల్లు(జగ్గయ్యపేట): తల్లిదండ్రులు పిల్లల చదువుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ పేర్కొన్నారు. గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన టీచర్స్ పేరంట్స్ సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో ఉపాధ్యాయులు విద్యాబోధన చేయాలన్నారు. పాఠశాలల్లో మంచి ఫలితాలు రావాలంటే నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికి తీయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనని చెప్పారు. విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
విద్యాభివృద్ధికి కృషి..
20 అంశాల కార్యక్రమ అమలు, వికసిత ఏపీ చైర్మన్ లంకా దినకర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నాయన్నారు. అనంతరం విద్యార్థులు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్, నందిగామ ఆర్డీవో బాలకృష్ణ, విద్యా కమిటీ చైర్మన్ పల్లపు సీతమ్మ, ఇన్‌చార్జ్ తహసీల్దార్ మనోహర్, ఎంపీడీవో నితిన్, ఎంఈవో చిట్టిబాబు, హెచ్‌ఎం రమణ పాల్గొన్నారు.


