అండర్–14 రగ్బీ రాష్ట్ర జట్ల ఎంపిక
గన్నవరం: జాతీయ స్థాయి స్కూల్ గేమ్స్ అండర్–14 రగ్బీ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే రాష్ట్ర బాల, బాలికల జట్లను ఎస్‌జీఎఫ్ పరిశీలకుడు కిరణ్ శుక్రవారం ప్రకటించారు. గన్నవరంలో రెండు రోజుల పాటు జరిగిన అంతర్ జిల్లాల పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన బాల, బాలికలను రాష్ట్ర జట్లకు ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. భువనేశ్వర్‌లో ఈ నెల రెండవ వారంలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో ఈ జట్లు పాల్గొంటాయని తెలిపారు.
బాలుర జట్టు....
ఎ.అరుణ్, టి. నరసింహులు, కె.మధు (కర్నూలు), టి.ప్రభుకిరణ్, బి. అమరకుమార్ (కృష్ణా), షేక్ అబిబుల్ రెహమాన్, యు.విశ్వమిత్ర (కడప), కె.సంతోష్ (నెల్లూరు), వి.హేమంత్(తూర్పు గోదావరి), బి.పవన్ (పశ్చిమ గోదావరి), ఎం.సుబ్రహ్మణ్యం(చిత్తూరు), ఎం.హర్షవర్ధనరాజు (గుంటూరు), మరో ఐదుగురు స్టాండ్‌బై.
బాలికల జట్టు....
పల్లూరి జ్యోతిప్రియ, షేక్ హుస్సేన్‌బీ, గొల్ల వర్షిత (కర్నూలు), దుక్కా వర్షిణి, భీమశెట్టి పుణ్యవతి (విశాఖపట్నం), రావిపాటి దివ్య (గుంటూరు), కొణతం శ్రీదుర్గా మహాలక్ష్మి (తూర్పు గోదావరి), కెల్లా తనూష, బూసిరాజు భావన(కృష్ణా), వరదరాజు వర్షిత (పశ్చిమ గోదావరి), కోన లోహిత (శ్రీకాకుళం), మరో ఐదుగురిని స్టాండ్‌బైగా ఎంపిక చేశారు.


