వైఎస్సార్ సీపీలో నియామకాలు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఎన్టీఆర్ జిల్లాకు చెందిన పలువురిని పార్టీలో వివిధ హోదాలలో నియమించారు. వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా రెడ్డి శ్రీనివాసరావు, సెక్రటరీ యాక్టివిటీగా బత్తుల సాయి కిరణ్‌కుమార్ రెడ్డి, జిల్లా యూత్ వింగ్ సెక్రటరీగా బొర్రా రాజా, జిల్లా బీసీ సెల్ ప్రధాన కార్యదర్శిగా జొన్నబోయిన శ్రీనివాసరావు, జిల్లా మహిళా విభాగం ప్రధాన కార్యదర్శిగా షేక్ వహీదున్నీషా నియమితులయ్యారు.
● వైఎస్సార్‌టీఎఫ్ నియోజకవర్గ అధ్యక్షులుగా కేవీఎస్ శర్మ( విజయవాడ సెంట్రల్), కురగంటి విజయ్‌కుమార్( జగ్గయ్యపేట), బత్తుల కృష్ణ (మైలవరం) నియమితులయ్యారు.
● వైఎస్సార్ సీపీ మైలవరం మండల ప్రధాన కార్యదర్శిగా పొదిల కృష్ణ, మైలవరం మండలం అనుబంధ విభాగ కమిటీల్లో బీసీ సెల్ సెక్రటరీగా పీట్ల రాము, ఎస్సీ సెల్ సెక్రటరీగా కొత్తపల్లి రవీంద్రబాబు నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
డ్రగ్స్‌ను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు
ఏలూరు రేంజి ఐజీ అశోక్‌కుమార్
అవనిగడ్డ: డ్రగ్స్‌ని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు ఏలూరు రేంజ్ ఐజీ అశోక్‌కుమార్ తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్‌ను ఐజీ అశోక్‌కుమార్ శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించిన ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రగ్స్ సరఫరా దారులు, వినియోగించే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. దీనిపై ఎప్పటికప్పుడు మానటరింగ్ చేసి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవడం ద్వారా గతంలో కంటే డ్రగ్స్ వినియోగం తగ్గిందన్నారు. కృష్ణాజిల్లాలో గతంలో కంటే క్రైం రేటు బాగా తగ్గిందని చెప్పారు. పాత రౌడీషీటర్లపై ప్రత్యేక దృష్టి సారించామని, వీరికి ఎప్పటి కప్పుడు కౌన్సెలింగ్ ఇస్తూ సత్ ప్రవర్తనతో మెలిగేలా చూస్తున్నామన్నారు. ప్రస్తుతం కొంతమంది శిక్షణలో ఉన్నారని వారంతా విధులకు హాజరైతే సిబ్బంది కొరత కొంతవరకూ తగ్గుతుందన్నారు. శిక్షణ పొందిన వారంతా విధుల్లో చేరిన తరువాత ట్రాఫిక్‌పై ప్రత్యేక దృష్టి పెడతామని ఐజీ తెలిపారు. అనంతరం క్రైం నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యల గురించి జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, డీఎస్పీ విద్యశ్రీతో పాటు సిఐలులకు ఆయన దిశా నిర్ధేశం చేశారు. తొలుత ఆయన పోలీసులచే గౌరవ వందనం స్వీకరించారు.
ఆధార్ దుర్వినియోగంతో నకిలీ సిమ్‌లు
అల్లిపురం: సైబర్ నేరాల నియంత్రణలో భాగంగా విశాఖపట్నం నగర సైబర్ క్రైమ్ పోలీసులు భారీ ఆపరేషన్ చేపట్టారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కస్టమర్ల ఆధార్‌ను, బయోమెట్రిక్ వివరాలను దుర్వినియోగం చేసి నకిలీ సిమ్ కార్డులు సృష్టిస్తున్న 10 మంది ముఠా సభ్యులను శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సిమ్ కార్డుల విక్రయ కేంద్రాల వద్దకు వచ్చే కస్టమర్ల నుంచి ఈ ముఠా చాకచక్యంగా వివరాలు సేకరిస్తోంది. ఐరిస్ లేదా థంబ్ స్కానర్‌పై సరిగా పడలేదని నమ్మించి, కస్టమర్ల నుంచి రెండోసారి బయోమెట్రిక్ వివరాలను తీసుకుంటున్నారు. కస్టమర్లకు తెలియకుండానే వారి పేరు మీద రెండో సిమ్‌ను యాక్టివేట్ చేస్తున్నారు. వాటిని ఉపయోగించి, నకిలీ ఐడీలతో సోషల్ మీడియా ఖాతాలు తెరిచి ఆ ఖాతాలను అంతర్జాతీయ స్థాయిలో తీవ్రమైన సైబర్ నేరాలకు పాల్పడే ముఠాలకు విక్రయిస్తున్నారు. పోలీసుల విచారణలో ఈ ముఠాలోని కీలక వ్యక్తులు పట్టుబడ్డారు. నిడదవోలుకు చెందిన ఇద్దరు వొడాఫోన్ డిస్ట్రిబ్యూటర్లు, పెడనకు చెందిన ఐదుగురు, నకిలీ జియో సిమ్ కార్డులు యాక్టివేషన్ చేస్తున్న గుంటూరు జిల్లాకు చెందిన ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.


