ఏపీ నాగవంశం కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు బాధ్యతల
భవానీపురం(విజయవాడపశ్చిమ): ఆంధ్రప్రదేశ్ నాగవంశం కార్పొరేషన్ చైర్మన్‌గా నియమితులైన ఎరుబోతు రమణారావు, డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం కార్యక్రమం గొల్లపూడిలోని బీసీ సంక్షేమ భవన్‌లో గురువారం జరిగింది. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు వారితో ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా నూతన చైర్మన్ రమణారావు మాట్లాడుతూ.. తనకు అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వర్తిస్తానన్నారు. విజయవాడలో కమ్యూనిటీ హాల్ నిర్మాణంతో పాటు వివిధ ప్రాంతాలలో కల్యాణమండపాల నిర్మాణానికి కృషి చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తనయుడు రవితేజ తదితరులు పాల్గొన్నారు.
ప్రమాణ స్వీకారం చేస్తున్న రమణారావు, డైరెక్టర్లు


