కష్టం ‘గురూ’! | - | Sakshi
Sakshi News home page

కష్టం ‘గురూ’!

Dec 4 2025 9:11 AM | Updated on Dec 4 2025 9:11 AM

కష్టం

కష్టం ‘గురూ’!

కష్టం ‘గురూ’! పులిచింతల సమాచారం గురువారం శ్రీ 4 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2025 u8లో మెగా పీటీఎంకు అరకొరగా నిధులు మంజూరు అరకొర నిధులతో పండుగ చేయాలా?

న్యూస్‌రీల్‌

నిధుల మంజూరు ఇలా..

ఉమ్మడి జిల్లాలో ఇదీ పరిస్థితి..

భవనాల పరిశీలన

నిత్యాన్నదానానికి విరాళాలు

విజయవాడ సిటీ
ఎన్టీఆర్‌ జిల్లా

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 3881 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా, దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. నిల్వ 42.1600 టీఎంసీలు.

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): అరొకర నిధులతో మెగా పేరెంట్‌ టీచర్స్‌ మీటింగ్‌ పండుగలా చేయాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయటం ఉపాధ్యాయులను విస్తుపోయేలా చేసింది. 30 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలో వారి తల్లిదండ్రులను, స్థానిక ప్రజాప్రతినిధులను పిలిచి రూ.900తో భారీగా సమావేశాన్ని నిర్వహించి పండుగ జరపాలంటూ ప్రభుత్వ విద్యాశాఖ ఆదేశాలివ్వటంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఏపీ విద్యాశాఖ ఈ నెల ఐదో తేదీన రాష్ట్ర వ్యాప్తంగా మెగా పీటీఎం 3.0 పేరుతో తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశాలను భారీగా నిర్వహించాలని తలపోస్తోంది. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున నియమనిబంధనలు, మార్గదర్శకాలను రూపొందించి, ఆదేశాలు జారీ చేసింది.

తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల సమావేశాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యాకమిటీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులను ఆహ్వానించి పాఠశాల ప్రగతిని చాటి చెప్పాలని సూచించారు. ప్రతి విద్యార్థి ప్రగతిని వారి తల్లిదండ్రులకు తెలియజేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమానికి విద్యార్థుల సంఖ్యను ప్రామాణికంగా తీసుకొని ప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిని ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రస్తుత మార్కెట్‌లో ఉన్న ధరల ప్రకారం ఈ సమావేశం నిర్వహణకు ప్రభుత్వం జారీ చేసిన నిధులు ఏమాత్రం చాలవని వారు చెబుతున్నారు.

ఉమ్మడి జిల్లాకు రూ. 50లక్షలు..

ఉమ్మడి కృష్ణాజిల్లాకు సుమారుగా రూ.50 లక్షలను కేటాయించినట్లు తెలిసింది. ఎన్టీఆర్‌ జిల్లాకు రూ.24లక్షలు కేటాయించారు. కృష్ణాజిల్లాకు సుమారుగా రూ.25 లక్షలు ఉన్నట్లుగా తెలిసింది. అయితే ఈ నిధులతో ఇన్ని వందలాది పాఠశాలలకు ఎలా ఖర్చులు సరిపోతాయంటూ ఉపాధ్యాయ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం తమ ప్రచార ఆర్భాటాల కోసం ఈ విధమైన హడావుడి చేసి ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురి చేయటంపై ఉపాధ్యాయులు మండిపడుతున్నారు.

పాఠశాలలో విద్యార్థుల సంఖ్య నిధుల మంజూరు

0 – 30మంది రూ.900

31 – 100మంది రూ.2,250

101 – 250మంది రూ.4,500

251 – 1000మంది రూ.6,750

1000మందికి పైన రూ.9,000

7

ఉమ్మడి జిల్లాలోని 2,309

పాఠశాలలకు రూ. 50లక్షలు కేటాయింపు

30లోపు విద్యార్థులు ఉన్న

పాఠశాలకు కేవలం రూ.900

పండుగలా చేయాలంటూ ఆదేశాలపై

ఉపాధ్యాయ సంఘాల ఆగ్రహం

రేపు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో

పేరెంట్‌–టీచర్స్‌ మీటింగ్‌

ఉమ్మడి కృష్ణాజిల్లాలో సుమారుగా

3,242 విద్యాసంస్థలు పని చేస్తున్నాయి.

ఎన్టీఆర్‌ జిల్లాలో సుమారుగా 1,451

విద్యాసంస్థలు ప్రాథమిక, ప్రాథమికోన్నత,

ఉన్నత పాఠశాలలు పని చేస్తున్నాయి.

వాటిల్లో సుమారుగా 3.30 లక్షల మంది విద్యార్థులు ఒకటి నుంచి పదో తరగతి వరకూ విద్యాభ్యాసం చేస్తున్నారు. వాటిలో సుమారుగా 509 వరకూ ప్రైవేట్‌ విద్యాసంస్థలు కొనసాగుతున్నాయి.

కృష్ణాజిల్లాలో 1791 విద్యాసంస్థలు ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు పని చేస్తున్నాయి. అందులో సుమారుగా 2.17 లక్షల మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. వాటిల్లో సుమారుగా 424 ప్రైవేట్‌ పాఠశాలలు కొనసాగుతున్నాయి.

అయితే గతంలో అన్ని విద్యాసంస్థల్లో మెగా పీటీఎం నిర్వహించగా.. ప్రస్తుతం ప్రభుత్వ విద్యాసంస్థల్లో మాత్రమే నిర్వహించేందుకు ఆదేశాలు జారీ చేశారు.

పెనమలూరు: తాడిగడప మునిసిపాలిటీలో ఆరోగ్య కేంద్రాలకు అనువైన భవనాల కోసం కృష్ణా జిల్లా వైద్యాధికారి యుగంధర్‌ బుధవారం పోరంకి, కానూరులో పర్యటించారు.

దుర్గమ్మ సన్నిధిలో నిత్యం నిర్వహించే అన్నప్రసాద వితరణకు విజయవాడకు చెందిన పలువురు దాతలు బుధవారం విరాళాలను అందజేశారు.

కష్టం ‘గురూ’! 1
1/5

కష్టం ‘గురూ’!

కష్టం ‘గురూ’! 2
2/5

కష్టం ‘గురూ’!

కష్టం ‘గురూ’! 3
3/5

కష్టం ‘గురూ’!

కష్టం ‘గురూ’! 4
4/5

కష్టం ‘గురూ’!

కష్టం ‘గురూ’! 5
5/5

కష్టం ‘గురూ’!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement