చోరీలకు చౌరస్తా! | - | Sakshi
Sakshi News home page

చోరీలకు చౌరస్తా!

Dec 4 2025 9:11 AM | Updated on Dec 4 2025 9:11 AM

చోరీల

చోరీలకు చౌరస్తా!

చోరీలకు చౌరస్తా! బ్రిటీష్‌ కాలం నుంచి దొంగలకు ఇది రాచబాట

ఇటీవల జరిగిన చోరీలు కొన్ని..

చోరీలకు అనువు..

నిఘా లేని గంగినేని..
బ్రిటీష్‌ కాలం నుంచి దొంగలకు ఇది రాచబాట

రాష్ట్ర సరిహద్దులోని గ్రామం

కేంద్రంగా వరుస దారి దోపిడీలు

బ్రిటీషు కాలంలో ఈ గ్రామంలోనే

ప్రత్యేక పోలీసుస్టేషన్‌ నిర్వహణ

చోరీల కోసం నాటి వ్యూహాలనే

నేటికీ అనుసరిస్తున్న దొంగలు

దగ్గరలోని రైల్వే స్టేషన్లను

వాడుకుంటున్న వైనం

గంజాయి సరఫరాకు అనుకూలంగా

మార్చుకున్న స్మగ్లర్లు

జి.కొండూరు: దట్టమైన అటవీ ప్రాంతం.. పక్కనే చిన్న చిన్న రైల్వే స్టేషన్‌లు.. రహదారి కూడా సక్రమంగా లేని లోయ గ్రామాలు.. మండల కేంద్రానికి పదిహేను కిలోమీటర్ల దూరం.. రాత్రయితే నిఘా అంతంతమాత్రం.. దారి కాయడం.. దోపిడీకి పాల్పడటం.. ఏళ్లుగా ఇదే తంతు.. జి. కొండూరు మండలంలోని రాష్ట్ర సరిహద్దు గ్రామమైన గంగినేని వద్ద రాష్ట్ర రహదారిని దొంగలు తమ అడ్డాగా మార్చేసుకున్నారు. బ్రిటీష్‌ కాలం నుంచి నేటికీ ఈ రాష్ట్ర రహదారి దొంగలకు రాజమార్గంగానే ఉంది. గత ప్రభుత్వంలో ఇసుక, మద్యం, కలప, మట్టి వంటివి ఏవీ కూడా అక్రమ రవాణా జరగకుండా ఉండేందుకు గంగినేని వద్ద స్టేట్‌ బార్డర్‌ చెక్‌పోస్టును ఏర్పాటు చేసి పకడ్బందీగా నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయడంతో అక్రమాలు, చోరీలకు అడ్డుకట్టపడింది. గత సార్వత్రిక ఎన్నికల అనంతరం చెక్‌పోస్టులను పూర్తిగా ఎత్తివేయడంతో నిఘా లోపం ఏర్పడి చోరీలకు, అక్రమాలకు అడ్డూ అదుపులేకుండా పోయింది.

రైల్వేస్టేషన్‌లే అడ్డాలుగా..

● గంగినేని గ్రామానికి దగ్గరగా ఉన్న తెలంగాణలోని ఎర్రుపాలెం రైల్వేస్టేషన్‌ను దొంగలు అడ్డాగా ఎంచుకుంటున్నట్లు తెలుస్తోంది. ఖమ్మం, విజయవాడ ప్రాంతాల నుంచి చోరీ చేసే ముఠాలు సాయంత్రానికి ఎర్రుపాలెం రైల్వేస్టేషన్‌కు చేరుకొని అర్ధరాత్రి వరకు ఆ పరిసర ప్రాంతాలలో వేచి ఉంటారు. ఆ తర్వాత చోరీ చేయాలనుకునే ప్రాంతాలలో స్థానిక దొంగలతో కమ్యూనికేట్‌ చేసుకొని, చోరీ చేసిన తర్వాత గంగినేని రహదారి గుండా మరలా ఎర్రుపాలెం రైల్వేస్టేషన్‌కు చేరుకొని తప్పించుకుంటున్నట్లు తెలుస్తోంది.

● పక్కపక్కనే ఉన్న చెర్వుమాధవరం, గంగినేని రైల్వే స్టేషన్‌లను అడ్డాలుగా వాడుకొని ఖమ్మం వైపు నుంచి వచ్చిన మహిళలు పత్తి, మిరపకాయలు వంటి వ్యవసాయ ఉత్పత్తులను చోరీ చేయడం ఇక్కడ పరిపాటి. ఖమ్మం వైపు నుంచి వచ్చిన మహిళలు పాసింజర్‌ ట్రైన్‌లో చెర్వుమాధవరం రైల్వేస్టేషన్‌లో దిగి ట్రాకు పక్కనే ఉన్న పత్తి చేలల్లో పత్తి తీసుకొని మరలా పాసింజర్‌ ట్రైన్‌ ఎక్కి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా 2022లో స్థానిక రైతులు పట్టుకొని జి.కొండూరు పోలీసులకు అప్పగించారు. ఈ విధంగా ఒకసారి 15మంది మహిళలు, రెండోసారి 20మంది మహిళలు పోలీసులకు చిక్కారు. ఇప్పటికీ ఇదే తంతు కొనసాగుతున్నట్లు రైతులు వాపోతున్నారు.

● గంగినేని, చెర్వుమాధవరం రైల్వేస్టేషన్‌లలో రైళ్లు క్రాసింగ్‌ పెట్టినప్పుడు ఆయిల్‌ ట్యాంకర్‌లతో వెళ్లే రైళ్లు, వివిధ రకాల సరుకులను తీసుకెళ్లే రైళ్లు నిలిపి ఉంచినప్పుడు దొంగల ముఠా చోరీలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రైల్వే గార్డులతో మాట్లాడుకొని స్థానికులు కొందరు ట్యాంకర్లలో ఆయిల్‌ను చోరీ చేస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. సహకరించిన గార్డులకు డబ్బు, బంగారపు ఉంగరాలను సైతం చేయిస్తున్నారని తెలుస్తోంది.

గంజాయి సరఫరా ఇక్కడి నుంచే..

విశాఖపట్నం నుంచి గంజాయిని ప్యాసింజర్‌ రైళ్లలో ప్రత్యేకంగా కొందరు వ్యక్తులు తీసుకొచ్చి గంగినేని, చెర్వుమాధవరం రైల్వేస్టేషన్‌లో దిగి పక్కనే ఉన్న మామిడి తోటల్లో పెట్టి స్థానికంగా సరఫరా చేసే వ్యక్తులకు సమాచారం అందించడం ద్వారా గంజాయి ఎన్టీఆర్‌ జిల్లాలోకి ప్రవేశిస్తోందని సమాచారం. ఈ రెండు రైల్వేస్టేషన్‌లనే గంజాయి సరఫరాకి కేంద్ర బింధువులుగా నిందితులు వాడుకుంటున్నారని సమాచారం.

మూతబడిన గంగినేని స్టేట్‌ బోర్డర్‌ చెక్‌పోస్టు

ఈ నెల 27వ తేదీన చెవుటూరు గ్రామంలోని ఓ ఇంట్లో, బడ్డీ కొట్టులో చోరీ జరిగింది. ఈ ఘటనలో డబ్బు, బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు.

సెప్టెంబర్‌ 17వ తేదీన రాత్రి జి.కొండూరు మండల పరిధి మునగపాడు గ్రామంలో దక్షిణముఖ ఆంజనేయస్వామి దేవాలయం, సెప్టెంబర్‌ 24వ తేదీన రాత్రి జి.కొండూరు మండల పరిధి కుంటముక్కల గ్రామంలో శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో చోరీ జరిగింది.

జి.కొండూరు మండల పరిధి సున్నంపాడు గ్రామంలో గతేడాది సెప్టెంబరు 6వ తేదీన షేక్‌ ఖాసీం ఇంట్లో చోరీ జరిగింది. నిందితుడు తెలంగాణ, మంచిర్యాల జిల్లా, ఖాసీపేట మండలం, సోమగూడెం గ్రామానికి చెందిన బండా సంపత్‌గా పోలీసులు గుర్తించి పట్టుకున్నారు.

గత ఏడాది మార్చి, ఏప్రిల్‌ నెలల్లో మునగపాడు, సున్నంపాడు, చెర్వుమాధవరం గ్రామాలలో విద్యుత్‌ మోటార్లు, కేబుళ్లు వరుస చోరీలు జరగడంతో రైతులు ఆందోళన చెందారు. ఇప్పటికీ ఈ చోరీలు జరుగుతూనే ఉన్నాయి.

మైలవరం, నందిగామ నియోజకవర్గాల్లో ఇటీవల వరుస చోరీలు జరగడం, నిందితులు తప్పించుకోవడానికి ఈ గంగినేని రాష్ట్ర రహదారే అనుకూలంగా మారినట్లు తెలుస్తోంది. జి.కొండూరు నుంచి గంగినేని శివారు రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టు వరకు పదిహేను కిలోమీటర్ల మేర రహదారికి ఆనుకొని ఆరు గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల పరిసరాలు మొత్తం వ్యవసాయ భూములు, అటవీ ప్రాంతం, కొండ ప్రాంతాలే ఎక్కువగా ఉన్నాయి. దీనికి తోడు ఈ గ్రామాలకు పశ్చిమ వైపుగా సికింద్రాబాద్‌, విజయవాడ రైల్వేలైన్‌ ఉంది. ఈ రైల్వేలైన్‌లో చెర్వుమాధవరం, గంగినేని, తెలంగాణలోని ఎర్రుపాలెం రైల్వేస్టేషన్‌లు పక్కపక్కనే ఉన్నాయి. దొంగలు వీటిని అనుకూలంగా మార్చుకున్నారు. అలాగే ఇటు మైలవరం, అటు నందిగామ నియోజకవర్గాల్లో చోరీలు చేసిన దొంగలు వెంటనే తప్పించుకునేందుకు తెలంగాణలోకి ప్రవేశించడానికి నిఘాలేని ఈ గంగినేని వద్ద ప్రాంతం సులువుగా మారింది.

చోరీలకు చౌరస్తా! 1
1/1

చోరీలకు చౌరస్తా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement