బందరులో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధుల పర్యటన | - | Sakshi
Sakshi News home page

బందరులో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధుల పర్యటన

Dec 4 2025 9:11 AM | Updated on Dec 4 2025 9:11 AM

బందరు

బందరులో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధుల పర్యటన

బందరులో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధుల పర్యటన రేపటి నుంచి ఫల, పుష్ప ప్రదర్శన స్వామిత్వ సర్వేను వేగవంతం చేయాలి అనధికారిక లే అవుట్లు ధ్వంసం

కోనేరుసెంటర్‌: బందరు మండలంలోని పలు గ్రామాల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులు బుధవారం పర్యటించారు. పలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించారు. అక్కడ గ్రామీణ ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. తొలుత చిన్నాపురం ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం పరిధిలోని రుద్రవరం హెల్త్‌ అండ్‌ వెల్నెస్‌ సెంటర్‌తో పాటు ఆర్‌. గొల్లపాలెంలోని 104 సర్వీస్‌లను పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం చిన్నాపురం పీహెచ్‌సీలో వైద్యసేవల కోసం వచ్చిన రోగులతో మాట్లాడి వైద్య సేవలు ఏ విధంగా అందుతున్నదీ అడిగి తెలుసుకున్నారు. పర్యటనలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులు డాక్టర్‌ అభిషేక్‌, డాక్టర్‌ రాధా, డాక్టర్‌ బోస్‌భా, డాక్టర్‌ శ్రావణి, డాక్టర్‌ అబ్దుల్‌ వాసే, డాక్టర్‌ రాఘవేంద్ర, డాక్టర్‌ సురేష్‌ ఉన్నారు. డీఎంహెచ్‌ఓ కార్యాలయం తరఫున ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ హిమబిందు, ఆయా పీహెచ్‌సీల వైద్యులు పాల్గొన్నారు.

లబ్బీపేట(విజయవాడతూర్పు): రోజ్‌ సొసైటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ ఆధ్వర్యంలో ఈ నెల 5 నుంచి 8 వరకు నగరంలోని సిద్ధార్థ హోటల్‌ మేనేజ్మెంట్‌ కళాశాల ప్రాంగణంలో ఫల, పుష్ప ప్రదర్శన నిర్వహించనున్నట్లు ఆ సొసైటీ అధ్యక్షురాలు సూరపనేని ఉషారాణి తెలిపారు. ఆ ప్రదర్శనకు సంబంధించిన పోస్టర్‌ బుధవారం నిర్వాహకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమ సొసైటీ ఆధ్వర్యంలో ప్రస్తుతం 8వ ప్రదర్శన ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వందకు పైగా స్టాల్స్‌ ఏర్పాటు చేస్తున్నామన్నారు. వివిధ రకాలైన పండ్ల మొక్కలు కూడా ఉంటాయన్నారు. ఢిల్లీకి చెందిన ప్రముఖ బోన్సాయ్‌ ఆర్టిస్ట్‌ ఆధ్వర్యంలో బోన్సాయ్‌ మొక్కల ప్రదర్శనతో పాటు బోన్సాయ్‌ మొక్కల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేస్తారని చెప్పారు. సొసైటీ కార్యదర్శి ఘంటసాల లక్ష్మి, స్వామి, పద్మ ప్రియ, సీతా మహాలక్ష్మి, అఖిల తదితరు పాల్గొన్నారు.

గన్నవరం: జిల్లాలో స్వామిత్వ సర్వేను వేగవంతం చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్‌ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో బుధవారం స్వామిత్వ సర్వే పురోగతిపై జిల్లాలోని సర్వేయర్లు, ఆర్‌ఎస్‌ డెప్యూటీ తహసీల్దార్లు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ స్వామిత్వ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని చెప్పారు. ఎటువంటి పొరపాట్లుకు తావివ్వకుండా జాగ్రత్తగా చేపట్టాలన్నారు. నిబంధనల ప్రకారం గ్రామంలోని ప్రతి ఇంటితో పాటు ఖాళీ స్థలాలకు కూడా పర్సన్‌ ప్రాపర్టీ నంబర్‌(పీపీఎన్‌) కేటాయించాల్సిందేనని సూచించారు. అంతిమంగా పీపీఎన్‌ల విస్తీర్ణం గ్రామ కంఠం మొత్తం విస్తీర్ణంతో లెక్క సరిపోవాలని చెప్పారు. ఆక్రమణలతో సంబంధం లేకుండా అంతర్గత రహదారులు వంకరలు లేకుండా తిన్నగానే మార్కింగ్‌ వేసి రికార్డుల్లో నమోదు చేయాలని తెలిపారు. తహసీల్దారు కె. వెంకటశివయ్య, ఎంపీడీఓ టి. స్వర్ణలత, సర్వేయర్లు పాల్గొన్నారు.

తాడికొండ: సీఆర్డీఏ అధికారులు మంగళవారం ఎన్‌టీఆర్‌ జిల్లాలోని అక్రమ లే అవుట్లను ధ్వంసం చేశారు. విజయవాడ రూరల్‌ మండలం పాతపాడులోని సర్వే నంబర్‌ 114లో 5.50 ఎకరాల భూమిలో అనధికారిక లే అవుట్‌, సర్వే నెంబర్‌ 145లోని 1.20 ఎకరాల భూమిలో అనధికారిక లే అవుట్‌లను ధ్వంసం చేశారు. సీఆర్డీఏ పరిధిలో అనధికారిక లే అవుట్‌లను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమన్నారు.

బందరులో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధుల పర్యటన 1
1/2

బందరులో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధుల పర్యటన

బందరులో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధుల పర్యటన 2
2/2

బందరులో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధుల పర్యటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement