డెమో రన్‌తో సరి..
గత ఏడాది నవంబర్ తొమ్మిదో తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు ఇతర మంత్రులు అధికారులు విజయవాడ పున్నమీ ఘాట్ నుంచి సీ ప్లేన్ ప్రారంభించి అందులో ఇక్కడి నుంచి శ్రీశైలం వెళ్లారు. శ్రీశైలానికి చేరుకున్న తర్వాత అక్కడ శ్రీ భ్రమరాంబిక మల్లికార్జునస్వామిని సందర్శించి తిరిగి అదే ప్లేన్‌లో విజయవాడ చేరుకున్నారు. ఈ సందర్భంగా రెండు ప్రాంతాల్లో సభలను ఏర్పాటు చేయటంతో పాటుగా మీడియాతో దీని గురించి నాయకులందరూ తెగ ఊదరగొట్టారు. త్వరలోనే దీని ఖర్చులు ఇతర వ్యయాలను చర్చించి ప్రయాణపు చార్జీలను ప్రకటిస్తామని, ఇదే రీతిలో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ సీప్లేన్ ఏర్పాట్లు చేస్తామంటూ చంద్రబాబు, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటనలు గుప్పించారు.


