మానుగాయ తెగులును పరిశీలించిన కలెక్టర్
గుడ్లవల్లేరు: మండలంలోని వేమవరప్పాలెంలో వరి పంటను కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ బుధవారం పరిశీలించారు. వరికి మానుగాయ సోకినట్లు ఆయన పరిశీలనలో తేలింది. మచిలీపట్నం నుంచి గుడివాడ వైపు ప్రయాణించే క్రమంలో పెడన–గుడివాడ ప్రధాన రహదారిపై రైతులు ఆరబెట్టిన ధాన్యపు రాశులను కలెక్టర్ పరిశీలించారు. గ్రామానికి చెందిన రైతు అబ్దుల్ సలాం ఒకటిన్నర ఎకరంలో పండించిన ఎంటీయూ 1318 రకం ధాన్యాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. యంత్రంతో కోత కోసి ధాన్యాన్ని ఆరబెట్టానని రైతు తెలి పారు. చేను ఈనిన సమయంలో మోంథా తుపాను ప్రభావంతో వర్షాలు పడ్డాయని, కంకులు తడిసి మానుగాయ తెగులు వచ్చిందని కలెక్టర్ బాలాజీకి రైతు వివరించారు.
సహకార వ్యవస్థ గొప్పది
హనుమాన్‌జంక్షన్ రూరల్: పాల ఉత్పత్తిలో దేశం అగ్రగామిగా నిలబడటంలో, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతంలో పాడిరైతుల సహ కార సంఘాలు కీలకంగా ఉన్నాయని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. వీరవల్లిలోని ‘ప్రాజెక్టు కామథేను’ పాల ఉత్పత్తుల కార్మాగారంలో కృష్ణా మిల్క్‌యూనియన్ వజ్రోత్సవం, జాతీయ పాల దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం నిర్వహించిన పలు కార్యక్రమాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఫ్యాక్టరీ ఆవరణలో నిర్మించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం జరిగిన వేడుకల్లో వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో సహకార వ్యవస్థ గొప్పదన్నారు. ఈ వ్యవస్థలో రాజకీయాలు ప్రవేశిస్తే లక్ష్యం దెబ్బతింటుందన్నారు. కృష్ణామిల్క్ యూనియన్ 60 ఏళ్ల విజయ ప్రస్థానం ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. అనంతరం పాడిరైతులకు రూ.11 కోట్ల బోనస్ పంపిణీ చేశారు. ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి బాలవర్ధనరావు, కృష్ణా మిల్క్ యూనియన్ ఎండీ కొల్లి ఈశ్వరబాబు పాల్గొన్నారు.
శృతిలయల సమ్మేళనం స్వరాత్మిక గాత్రం
విజయవాడకల్చరల్: శ్రీ సద్గురు సంగీత సభ ఆధ్వర్యంలో 32వ జాతీయ సంగీతోత్సవంలో భాగంగా జీవీఆర్ సంగీత కళాశాలలో గోకరాజు గంగరాజు కళావేదికపై బుధవారం స్వరాత్మిక నిర్వహించిన గాత్ర సంగీత సభ రెండు గంటల పాటు స్వరలయ సమ్మేళనంలా సాగింది. వర్ణంతో ప్రారంభించి పలు కీర్తనలను ఆలపించారు. ఆర్.దినకర్ వయోలిన్‌పై, మృదంగంపై వి.వి. ఎస్.ప్రకాష్, ఘటంపై కె.వి.రామకృష్ణ సహకరించారు. శ్రీ సద్గురు సంగీతసభ సభ్యులు ప్రకాష్, గౌరీనాథ్, గాయత్రి గౌరీనాథ్, బి.హరిప్రసాద్, జె.ఎస్.ఎస్.ప్రసాద్‌శర్మ, వీర్ సుబ్ర హ్మణ్యం పాల్గొన్నారు. గురువారం సాయంత్రం విఖ్యాత గాత్ర విద్వాంసుడు సాయి విఘ్నేష్ గాత్ర కచేరీ జరగనుంది.
భవిరి రవికి డాక్టరేట్
నాగాయలంక: మండలకేంద్రమైన నాగాయలంకకు చెందిన ప్రముఖ మిమిక్రీ కళాకారుడు భవిరి రవి న్యూఢిల్లీలోని కాలిఫోర్నియా పబ్లిక్ యూనివర్సిటీ నుంచి డి.లిట్ పట్టా పొందారు. బుధవారం జరిగిన యూనివర్సిటీ స్నాతకోత్సవంలో ఆయనకు విశ్వవిద్యాలయం డీన్ అండ్ అంబాసిడార్ ఆఫ్ మదగస్కర్ డాక్టర్ రఘు నాథ్ పార్కర్ చేతుల మీదుగా డీ లిట్ అందు కున్నారు. 48ఏళ్లుగా తాను మిమిక్రీ రంగంలో ఉంటూ, ప్రజా సేవలు కొనసాగిస్తున్న నేపథ్యంలో యూనివర్సిటీ ఈ గౌరవ డాక్టరేట్ అందచేసిందని భవిరి రవి తెలిపారు. భవిరి రవి 12 వేలకు పైగా మిమిక్రీ ప్రదర్శనలు ఇచ్చారు. అమెరికా, అబుదాబీ, బహ్రెయిన్, దుబాయ్, షార్జా, మారిషస్, మలేషియా, సింగపూర్ తదితర దేశాలలో రవి మిమిక్రీ ప్రదర్శనలిచ్చి ప్రఖ్యాతి పొందారు. భవిరికి ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, మాజీ ఎమ్మెల్యేలు సింహాద్రి రమేష్‌బాబు, అంబటి శ్రీహరి ప్రసాద్ తదితరులు అభినందనలు తెలిపారు.
మానుగాయ తెగులును పరిశీలించిన కలెక్టర్
మానుగాయ తెగులును పరిశీలించిన కలెక్టర్
మానుగాయ తెగులును పరిశీలించిన కలెక్టర్


