మాతృమరణాల నివారణకు చర్యలు
మచిలీపట్నంఅర్బన్: గర్భిణులలో ఐఎఫ్‌ఏ సప్లిమెంటేషన్, డీ–వర్మింగ్, పోషక సలహాలు, హెమోగ్లోబిన్ స్థాయిల పర్యవేక్షణ వంటివి అమలు చేయడంతో మాత మరణాలను తగ్గించవచ్చని కృష్ణా జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ పి. యుగంధర్ తెలిపారు. గురువారం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఉప–జిల్లా స్థాయి మాతృ మరణాలపై సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫీల్డ్, ఫెసిలిటీ స్థాయిలలో గుర్తించిన లోపాలను సమీక్షించి, సంబంధిత ఆరోగ్య సిబ్బందికి స్పష్టమైన సూచనలు చేయాలన్నారు. సంక్లిష్ట కేసులను ఉన్నత స్థాయి వైద్య సంస్థలకు రిఫర్ చేయడంతో పాటు బాధ్యతా వ్యవస్థలను బలపరచాలని సూచించారు. సమావేశంలో ఇటీవల నమోదైన రెండు మాతృ మరణ కేసు వివరాలను లోతుగా పరిశీలించారు. డీసీహెచ్‌ఎస్ డాక్టర్ శేషు కుమార్, డీఐఓ డాక్టర్ ప్రేమ్ చంద్, డాక్టర్ జయకుమార్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో రాక్షస పాలన
ఇబ్రహీంపట్నం: రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వంలో రాక్షస పాలన నడుస్తోందని విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి అన్నారు. అక్రమంగా అరెస్ట్ అయిన మాజీ మంత్రి జోగి రమేష్ సతీమణి జోగి శకుంతలమ్మ, వారి కుటుంబ సభ్యులను ఇబ్రహీంపట్నంలో కలసి పరామర్శించారు.జోగి రమేష్ అరెస్టు ముమ్మాటికీ కక్ష సాధింపు చర్యే అన్నా రు. నకిలీ మద్యం ఫ్యాక్టరీలు బయటపడ్డ వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు ప్రభుత్వం వైఎస్సార్ సీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయించేందుకు ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారీ కేంద్రాన్ని నారావారి సారా అన్నందుకే కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. ఎల్లకాలం ఈ ప్రభుత్వమే ఉండదనే విషయం గుర్తుంచుకోవాలని హితవు పలికారు.
లక్ష్మీపురం: గుంటూరు రైల్వే డివిజన్ డీసీఎం కమలాకర్‌బాబు విజయవాడకు గురువారం బదిలీ అయ్యారు. డీఆర్‌ఎం కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన వీడ్కోలు సభలో డివిజన్ అధికారులు ఆయన్ను సత్కరించారు. అనంతరం మాట్లాడుతూ డివిజన్ పరిధిలోని ఉద్యోగులంతా ఎంతో స్నేహభావంతో ఉంటూ, సహకారం అందించారని తెలిపారు. గుంటూరు డివిజన్ అధికారులకు, సిబ్బందికి సహాయ సహకారాలు అందించేందుకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు.
మాతృమరణాల నివారణకు చర్యలు
మాతృమరణాల నివారణకు చర్యలు


