నిలబడి ఉన్న పంట నష్టం కూడా గుర్తించాలి
నేను కౌలురైతుని. తుపాను కారణంగా సాగు చేసిన వరి పంట రెండెకరాలకు పైగా నేలవాలింది. నిలబడ్డ పైరులో మడమ తాలు కనిపిస్తోంది. తాలు తప్ప వచ్చే శాతం ఎక్కువగా ఉంది. పైరు నిలబడి ఉంది అని సంతోషించేందుకు లేదు. ఆ నష్టం కూడా ఎక్కువే ఉంది. దాన్ని కూడా అధికారులు పరిశీలించాలి. నష్టపరిహారం దానికి కూడా ఇస్తేనే కోలుకుంటాం. ప్రభుత్వం పెద్ద మనసుతో ఆదుకోవాలి.
– వి.జాన్‌మోజెస్,
కౌలురైతు, జగన్నాథపురం


