అన్నదాతపై వివక్ష ఎందుకు? | - | Sakshi
Sakshi News home page

అన్నదాతపై వివక్ష ఎందుకు?

Nov 12 2025 5:39 AM | Updated on Nov 12 2025 5:39 AM

అన్నదాతపై వివక్ష ఎందుకు?

అన్నదాతపై వివక్ష ఎందుకు?

● ప్రతిరైతుకూ పరిహారం అందాలి ● ఏడాదిన్నర కాలంలో ఒక్క పింఛనూ మంజూరు చేయలేదు ● ఆరోగ్యశ్రీ పథకానికి డబ్బులు వసూలు చేస్తున్నారు ● జిల్లా పరిషత్‌ స్థాయీ సంఘ సమావేశాల్లో సభ్యుల ఆవేదన ● గ్రామీణాభివృద్ధి స్థాయీ సంఘ సమావేశంలో పెనుగంచిప్రోలు జెడ్పీటీసీ నాగమణి మాట్లాడుతూ డ్వాక్రా మహిళలు సకాలంలో రుణాలు చెల్లించినప్పటికీ బ్యాంకులు రుణాలు ఇవ్వటంలో తాత్సారం చేస్తున్నాయని దీని కారణంగా గ్రూపు సభ్యులు ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయన్నారు. కో–ఆప్షన్‌ సభ్యులు మాట్లాడుతూ సంవత్సరన్నర కాలంగా ఒక్క కొత్త పింఛను మంజూరు చేయలేదని.. గత ప్రభుత్వంలో మూడు, ఆరు నెలలకు ఒకసారి కొత్త పింఛన్లను మంజూరు చేసేవారన్నారు. అలాగే జెడ్పీటీసీ సభ్యులకు గౌరవ వేతనం చెల్లించే విషయంలో ప్రభుత్వం తాత్సారం చేస్తోందని విమర్శించారు. దీనిపై సీఈవో స్పందిస్తూ ప్రభుత్వానికి ఎరియర్‌ బకాయిలు ఎంత మొత్తం రావాలో తాము నివేదిక పంపామని, నిధులు విడుదల కాగానే చెల్లిస్తామన్నారు. ● గృహనిర్మాణశాఖ సంబంధించి చర్చ సమయంలో సభ్యులు మాట్లాడుతూ గతంలో ఇళ్ల నిర్మాణం చేసిన వారికి ఇంత వరకు బిల్లులు రాలేదని లబ్ధిదారులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని సభ దృష్టికి తీసుకువచ్చారు. అలాగే నిర్మాణం పూర్తి చేసిన వారికి బిల్లులు పడుతున్నాయని గృహనిర్మాణశాఖ అధికా రులు చెప్పటంతో బిల్లులు పడుతున్నట్లు లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తే ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేస్తారని సభ్యులు అధికారులను కోరారు. ● పంచాయతీ శాఖకు సంబంధించి చర్చలో కేసరపల్లి, గన్నవరం తదితర గ్రామాల్లో కొన్ని గృహాలకు ఇంటిపన్నులు వేయటం లేదని దీని వల్ల పంచా యతీలకు ఆదాయం తగ్గిపోతోందని కో–ఆప్షన్‌ సభ్యులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. విజయవాడ రూరల్‌ జెడ్పీటీసీ కాకర్లమూడి సువర్ణ రాజు మాట్లాడుతూ రామవరప్పాడు గ్రామంలో శ్మశానంలో చెత్తను వేస్తున్నారని, దీని కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వత్సవాయి గ్రామంలో తుపాను నాటి నుంచి ఇప్పటి వరకు తాగునీటి సరఫరా జరగటం లేదని జెడ్పీటీసీ సభ్యురాలు సభ దృష్టికి తీసుకువచ్చారు.

అధికారులు రాకుంటే ఎలా?

ఆరోగ్య శ్రీలో డబ్బులు వసూళ్లు..

చిలకలపూడి(మచిలీపట్నం): మోంథా తుపాను కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ ఉప్పాల హారిక అన్నారు. జిల్లా పరిషత్‌ సమావేశపు హాలులో మంగళవారం జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు నిర్వహించారు. వ్యవసాయ స్థాయీ సంఘ సమావేశంలో జెడ్పీ కో–ఆప్షన్‌ సభ్యుడు ఎండీ గౌసాని, గూడూరు జెడ్పీటీసీ సభ్యుడు వేముల సురేష్‌ మాట్లాడుతూ పార్టీల పరంగా నష్టపరిహారాన్ని అంచనా వేస్తున్నారని అలా కాకుండా రైతులకు పార్టీలను అంటకట్టకుండా నష్టం భర్తీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. చైర్‌ పర్సన్‌ హారిక మాట్లాడుతూ మోంథా తుపాను ప్రభావం వల్ల రైతులకు చాలా మంది పంట చేతికొచ్చే సమయానికి నేలవాలిపోవటం, నీటితో నిండి పోవటం వంటి నష్టాలు జరిగాయని, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క రైతును ఆదుకునే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. దీనిపై వ్యవసాయశాఖ అధికారి పద్మావతి స్పందిస్తూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం తాము నష్టం అంచనాలను రూపొందిస్తున్నామని శాస్త్రవేత్తల నివేదికల ఆధారంగా ప్రభుత్వానికి నివేదించి రైతులకు నష్టం పరిహారం చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.

కో–ఆప్షన్‌ సభ్యుడు గౌసాని మాట్లాడుతూ తాము ఎంతో దూరం నుంచి ప్రజల సమస్యల పరిష్కారం కోసం సమావేశాలకు హాజరువుతుంటే సంబంధిత అధికారులు మాత్రం హాజరుకాకుండా కిందిస్థాయి సిబ్బంది పంపటం ఉపయోగం ఉండటం లేదన్నారు. దీనిపై సీఈవో కన్నమనాయుడు స్పందిస్తూ తప్పనిసరిగా ప్రతి ఒక్క అధికారి సమావేశానికి హాజరుకావాలని, లేకుంటే వారే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందని హెచ్చరించారు.

వైద్య, ఆరోగ్యశాఖకు సంబంధించి చర్చ జరిగిన సమయంలో ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి కొంత మంది వైద్యులు పథకం ద్వారా కాకుండా విడిగా డబ్బులు వసూలు చేసి ఆపరేషన్లు చేస్తున్నారని దీని కారణంగా పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. దీనిపై ఎన్టీఆర్‌ జిల్లా డీఎంఅండ్‌హెచ్‌వో సుహాసిని స్పందిస్తూ ఆరోగ్యశ్రీ పథకంలో వైద్యం చేయించుకుంటే ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదని అటువంటి పరిస్థితులు ఎదురైతే ఎన్టీఆర్‌ జిల్లా కో–ఆర్డినేటర్‌ 92810 68152 నంబర్‌ను సంప్రదించాలని ఆమె సభ్యులకు సూచించారు. సాంఘిక సంక్షేమ, సీ్త్ర శిశు సంక్షేమ, ఆర్థిక, పనుల స్థాయీ సంఘ సమావేశాలకు సంబంధించి పలు అంశాలపై చర్చించారు. సమావేశాల్లో జెడ్పీ డెప్యూటీ సీఈవో ఆర్‌సీ ఆనంద్‌కుమార్‌, ఉమ్మడి కృష్ణాజిల్లా అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement