వైఎస్సార్ ట్రేడ్ యూనియన్‌ను బలోపేతం చేద్దాం
లబ్బీపేట(విజయవాడతూర్పు): వైఎస్సార్ ట్రేడ్ యూనియన్‌ను మరింత బలోపేతం చేయడంతో పాటు, వైఎస్సార్ సీపీని మళ్లీ అధికారంలోకి తీసుకు రావడమే లక్ష్యంగా రానున్న రోజుల్లో పనిచేయాలని యూనియన్ నేతలు నిర్ణయించారు. గుణదలలోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో మంగళవారం వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ట్రేడ్ యూనియన్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు విశ్వనాథ రవి మాట్లాడుతూ.. ప్రజలతో పాటు, ఉద్యోగ, కార్మిక, కర్షకులకు చంద్రబాబు ప్రభుత్వం చేసే అన్యాయాలకు నిరసనగా పార్టీ పిలుపునిచ్చే కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలన్నారు. వైద్య కళాశాలలు ప్రైవేటీకరణకు నిరసనగా ఈ నెల 12న జరిగే ర్యాలీల్లో కూడా పాల్గొనాలన్నారు. వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరు గౌతమ్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నాన్ని జిల్లా యూనియన్ తరఫున ఖండించారు. ఈ సమావే శంలో జిల్లా మునిసిపల్ వింగ్ అధ్యక్షుడు గొట్టిపాటి హరీష్, జిల్లాలోని నియోజవర్గాల ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు బోయళ్ల రాజేష్, పసుపులేటి కోటేశ్వరరావు, యరదేసి రామారావు, సూరిబాబు, మెండెం రామారావు, ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి సుంకర నారాయణ, ఇబ్రహీంపట్నం మండల అధ్యక్షుడు ప్రసాద్‌రావు తదితరులు పాల్గొన్నారు.


