అన్నదానానికి రూ.3.50 లక్షల విరాళం
హనుమాన్‌జంక్షన్ రూరల్: హనుమాన్‌జంక్షన్‌లోని ప్రసిద్ధ అభయాంజనేయ స్వామి దేవస్థానంలో ప్రతి మంగళవారం నిర్వహించే అన్నదాన కార్యక్రమానికి దాతలు రూ.3.50 లక్షల విరాళం సమర్పించారు. నూజివీడుకు చెందిన పి.వి.ఎన్.ఎస్. రాంప్రసాద్, తేజశ్రీ దంపతులు ఈ మొత్తాన్ని ఆలయ పాలకమండలి చైర్మన్ వేమూరి శ్రీనివాసరావుకు అందజేశారు. ఈ సందర్భంగా దాతలు ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దాతలకు స్వామి వారి శేషవస్త్రాలు, ప్రసాదాలను ఆలయ కార్యనిర్వాహణాధికారి పితాని తారకేశ్వరరావు అందించారు.


