జాతీయ ఈత పోటీలకు ఎస్‌ఆర్‌ఆర్ అధ్యాపకుడు
మధురానగర్(విజయవాడసెంట్రల్): మాచవరం ఎస్‌ఆర్‌ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వ్యాయామ అధ్యాపకుడు డాక్టర్ డి. యుగంధర్ జాతీయ ఈత పోటీలకు ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్ అమెచ్యూర్ ఆక్వాటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడ గాంధీనగర్ మునిసిపల్ కార్పొరేషన్ స్విమ్మింగ్ పూల్‌లో ఈనెల 9న జరిగిన 6వ మాస్టర్స్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఆక్వాటిక్ చాంపియన్ షిప్–2025 పోటీలలో, డాక్టర్ డి. యుగంధర్ 55–59 ఏజ్ గ్రూపులో పాల్గొని నాలుగు స్వర్ణ పతకాలు సాధించారు. దీంతో ఈనెల 21 నుంచి 23వ తేదీ వరకు హైదరాబాద్‌లోని గచ్చిబౌలి అంతర్జాతీయ ఈత స్టేడియంలో జరిగే జాతీయ స్థాయి పోటీలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ సందర్భంగా సోమవారం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. భాగ్యలక్ష్మి అధ్యక్షతన స్టాఫ్ క్లబ్ ఆధ్వర్యంలో యుగంధర్‌ను ఘనంగా సత్కరించారు. వైస్ ప్రిన్సిపల్ పి. శైలజ, అధ్యాపకులు పాల్గొన్నారు.


