బైక్‌లో దూరిన పాము
తప్పిన ప్రమాదం
అవనిగడ్డ: పిల్లలను స్కూల్‌కు తీసుకెళుతున్న సమయంలో బైక్ లోపల పాము దూరడంతో స్థానికులు స్పందించి పామును చంపడంతో పెను ప్రమాదం తప్పింది. సేకరించిన వివరాలు ప్రకారం ఓ వ్యక్తి తన పిల్లలను స్థానిక సెయింట్ ఆన్స్ స్కూల్‌కు తీసుకెళుతుండగా గేటు ముందు సడన్‌గా బైక్ కిందకు పసికిరి పాము వచ్చింది. పక్కనున్న వారు చూసి కేకలు వేయడంతో, అతను పిల్లలను దించేసి బైక్‌ని పక్కకు పడేశాడు. అప్పటికే బైక్‌లోపలకు దూరిన పాము పలు డోముల్లోకి మారుతూ కంగారు పెట్టింది. కొంతమంది స్థానికులు కర్రలు తెచ్చి డోములను కదపడంతో బయటకు వచ్చిన పాముని వారు చంపేశారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.


