మాస్టర్ అథ్లెట్ల పతకాల పంట
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): చైన్నెలో ఈ నెల 5 నుంచి 9వ తేదీ వరకు జరిగిన 23వ ఆసియా మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్–2025లో ఎన్టీఆర్ జిల్లా తరఫున పాల్గొన్న క్రీడాకారులు ప్రతిభ చూపి పతకాలు సాధించారు. 22 దేశాల నుంచి 4వేల మంది క్రీడాకారులు పాల్గొన్న ఈ పోటీల్లో ఎన్టీఆర్ జిల్లా నుంచి ఆరుగురు క్రీడాకారులు పాల్గొనగా, వారిలో ముగ్గురు వివిధ విభాగాల్లో ప్రతిభ చూపి పతకాలు సొంతం చేసుకున్నారు. 80ఏళ్ల వయస్సు విభాగంలో ఏవీ సుబ్బలక్ష్మి 4 పతకాలు సాధించారు. డిస్కస్ త్రో, జావెలిన్ త్రో, ట్రిపుల్ జంప్‌లో స్వర్ణ పతకాలు, లాంగ్‌జంప్‌లో కాంస్య పతకం సాధించారు. 80ఏళ్ల విభాగంలో కనగల మల్లికార్జునరావు 5 కిలో మీటర్ల రన్నింగ్, రేస్‌వాక్‌లో రజత పతకాలు సాధించారు. 70ఏళ్ల వయస్సు విభాగంలో లింగం రవీంద్రరావు 10 కిలో మీటర్ల రోడ్ రేస్‌లో స్వర్ణ పతకం సాధించారు.
అభినందన..
పతకాలు సాధించిన క్రీడాకారులను నగరంలోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం ఆవరణలో ఉన్న మాస్టర్ అఽథ్లెటిక్ అసోసియేషన్ హాలులో సోమవారం అభినందించారు. మాస్టర్ అథ్లెటిక్ అసోసియేషన్ అధ్యక్షుడు జ్యోతి ప్రకాష్, కార్యదర్శి హర గోపాల్ మాట్లాడుతూ పతకాలు సాధించిన ఈ మాస్టర్ అథ్లెట్లు వచ్చే ఏడాది ఆగస్టులో సౌత్ కొరియాలో జరిగే వరల్డ్ మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనడానికి అర్హత సాధించారని తెలిపారు.
ఆసియా మాస్టర్స్ అథ్లెటిక్స్
చాంపియన్‌షిప్–2025లో
సత్తా


