యువ మేధకు చుక్కాని ‘ఆర్‌టీఐహెచ్’
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): యువ మేధస్సుకు చుక్కాని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (ఆర్టీఐహెచ్)అని.. యువ పారిశ్రామికవేత్తలను చేయిపట్టి నడిపించేందుకు, స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు ఈ హబ్, స్పోక్ ద్వారా సరికొత్త చొరవ చూపుతున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. సోమవారం కలెక్టరేట్ ప్రాంగ ణంలో ఆర్‌టీఐహెచ్ ఇగ్నైట్ సెల్‌ను ఏర్పాటు చేసిన కలెక్టర్ లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ తదితరులు సందర్శించారు. అయిదు స్టార్టప్‌ల వ్యాపార నమూనాలను ప్రదర్శించగా.. ఆయా స్టార్టప్‌ల ప్రస్తుత స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ కొత్త ఆవిష్కరణల రాష్ట్రాన్ని వేదికగా తీర్చిదిద్దేందుకు ఏర్పాటుచేసిన ఆర్‌టీఐహెచ్ హబ్, స్పోక్‌లు విశేషంగా కృషిచేస్తున్నాయని.. ఇగ్నైట్ సెల్ ద్వారా ఈ హబ్ కార్యకలాపాలు, అందుబాటులో ఉన్న అవకాశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ


