ప్రజా ఉద్యమాన్ని విజయవంతం చేద్దాం
ఇబ్రహీంపట్నం: మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడంపై నిరసనగా వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ఈనెల 12న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించనున్న వైఎస్సార్ సీపీ ప్రజా ఉద్యమం కార్యక్రమాలు విజయవంతం చేయాలని రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రా ల్లో ర్యాలీలు, నిరసనలు జరపాలని కోరారు. వైఎస్సా ర్ సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ (దళిత ఫోర్స్) రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, డివిజన్, గ్రామ, వార్డు, స్థాయి దళిత నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని సూచించారు.
వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్
రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్‌బాబు


