వన సమారాధనలకు అనువైన ప్రదేశం
పెనుగంచిప్రోలు తిరుపతమ్మ క్షేత్రం..
పెనుగంచిప్రోలు: పవిత్ర కార్తీక మాసంలో శివాలయాల దర్శనంతో పాటు వన సమారాధనలకు భక్తులు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఆహ్లాదాన్ని పంచే పెనుగంచిప్రోలు పుణ్యక్షేత్రం వన సమారాధనలకు ఎంతో అనువైన ప్రదేశం. ఏటా కార్తీక మాసంలో మునేరు అవతల ఉన్న మామిడి తోటల్లో వన సమారాధనల కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. ప్రసిద్ధి చెందిన శ్రీ తిరుపతమ్మ ఆలయం, సమీపంల పవిత్ర స్నానాలు చేసేందుకు మునేరు, సామూహిక సహ పంక్తి భోజనాలు, ఆటపాటలకు అందమైన మామిడి తోటలు ఆహ్లాదాన్ని పంచుతాయి. విజయవాడ నగరానికి 70 కిలోమీటర్లు నందిగామ, జగ్గయ్యపేట పట్టణాల నుంచి 17 కిలో మీటర్ల దూరంలో ఉంది ఈ పెనుగంచిప్రోలు పుణ్యక్షేత్రం. విశాలంగా ఉండే ఆలయం. దీని చుట్టూ పచ్చని తోటలు ఎంతో ప్రశాంతత, ఆహ్లాదాన్ని ఇస్తాయి. తోటల్లో ఆట, పాటలతో సరదాతో పాటు ఉసిరి చెట్టు కింద కార్తీక మాస వ్రతాలు, కథలు చెప్పుకుంటూ ఆధ్యాత్మిక వాతావరణంలో గడపవచ్చు.


