విద్యుత్ లో ఓల్టేజ్ సమస్య పరిష్కరించాలి
గాంఽధీనగర్(విజయవాడసెంట్రల్): విద్యుత్ లో ఓల్టేజ్ సమస్య సమస్య పరిష్కరించాలని ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పి. పుల్లారెడ్డి విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. గురువారం విజయవాడ పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ వద్ద గల ఏపీసీపీడీసిఎల్ సర్కిల్ కార్యాలయంలో అన్ని జిల్లాలో ఎస్‌ఈలు, ఈఈలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పీఎం సూర్య ఘర్ పథకం, మోంథా తుపాను నష్టాలు, రెవెన్యూ కలెక్షన్స్, ఆర్డీఎస్‌ఎస్ వంటి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యూ కలెక్షన్స్, నూరు శాతం సాధించాలన్నారు. అలాగే ఎక్కడా లో ఓల్టేజ్ సమస్య లేకుండా చూడాలన్నారు. పీఎం సూర్య ఘర్ డ్రైవ్‌పై అధికారులకు ఆదేశాలిచ్చారు. సమీక్ష సమావేశంలో టెక్నికల్, ప్రాజెక్టు, ఫైనాన్స్ డైరెక్టర్లు మురళీ కృష్ణయాదవ్, వెంకటేశ్వర్లు, సీజీఎంలు పాల్గొన్నారు.
ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పి.పుల్లారెడ్డి


