ఏటా ఇదే పరిస్థితి
మునేరు ప్రాంతాన ఉన్న పొలాలకు ప్రతి ఏడాది అధిక వర్షాలు కురిసినప్పుడల్లా మునేరుకు వరద రావటం, పొలాలను ముంచెత్తటం జరుగుతోంది. పంట కోల్పోవటంతో ఏటా నష్టాలు తప్పటం లేదు. ప్రభుత్వం పంట నష్టం అందరికీ సక్రమంగా అందించి ఆదుకోవాలి.
– మందడపు బ్రహ్మం, రైతు, పెనుగంచిప్రోలు
వారం రోజుల్లో పంట ఇంటికొస్తుందనగా తుపాను వచ్చింది. దాని ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు మునేరుకు వరద రావటం, పంటలు మునిగిపోవటం జరిగిపోయింది. గత ఏడాది కూడా ఇదే పరిస్థితి వచ్చింది. ఎకరానికి రూ.30 వేల వరకు పెట్టుబడి అయింది. ఏటా వరదల నుంచి పంటలు ఎలా కాపాడుకోవాలో తెలియటం లేదు.
– మురళి, రైతు, అనిగండ్లపాడు
●
ఏటా ఇదే పరిస్థితి


