22 నుంచి ఇంటర్నేషనల్ చెస్ టోర్నీ
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): విజయవాడలోని మేరీస్ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో ఈ నెల 22నుంచి 24వ తేదీ వరకు ఈకార్న్ ఇంటర్నేషనల్ ఫిడో రేటింగ్ చెస్ టోర్నమెంట్–2025ను నిర్వహిస్తున్నామని ఆంధ్రా చెస్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఫణి కుమార్ చెప్పారు. టోర్నమెంట్‌కు సంబంధించిన పోస్టర్‌ను మేరీస్ స్టెల్లా కళాశాల ఆవరణలో బుధవారం ఆవిష్కరించారు. ఈ సంద ర్భంగా ఫణి కుమార్ మాట్లాడుతూ ఆల్ ఇండి యా చెస్ ఫెడరేషన్, ఆంధ్రా చెస్ అసోసియేషన్ సంయుక్తంగా ఈ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నామని, ఈ టోర్నమెంట్‌లో మన రాష్ట్రం నుంచే కాకుండా వివిధ దేశాల నుంచి చెస్ క్రీడాకారులు పాల్గొంటారన్నారు. ఈ పోటీల్లో విజేతలకు రూ.8లక్షల విలువైన బహుమతులను అందజేయనున్నామని చెప్పారు. కళాశాల ప్రిన్సిపాల్ జి.ఇన్యాసమ్మ, కళాశాల కోచ్ వి.రాజ్ కుమార్, ఎన్టీఆర్ జిల్లా చెస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అక్బర్ బాషా, ఈకార్న్ సంస్థ ప్రతినిధి ఎం.సిగ్థ పాల్గొన్నారు.


