సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు
ఇబ్రహీంపట్నం: అవినీతి ఆరోపణలపై ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ కార్యాలమంలో ఏసీబీ అధికారులు బుధవారం తనిఖీలు నిర్వహించారు. ఏసీబీ అధికారి బీవీ సుబ్బారావు పర్యవేక్షణలో 11.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు సోదాలు చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తనిఖీలు చేపట్టామని చెప్పారు. లోపల వారిని బయటకు రాకుండా బయటవారిని లోపలకు అనుమతించకుండా చూశారు. తనిఖీల్లో పలు రికార్డులు పరిశీలించారు. ఇన్‌చార్జ్ సబ్ రిజిస్టార్ ఎస్కే మహ్మద్‌తో పాటు ఇతర సిబ్బందిని విచారించారు. పరిసర ప్రాంతాల్లో ఉన్న డాక్యుమెంట్ రైటర్లుతో కుమ్మకై ్క అవినీతికి పాల్బడుతున్నారనే విషయాన్ని గుర్తించారు. దీంతో పాటు ఇబ్రహీంపట్నం మండలం పరిధిలోని గ్రామాల్లో భూముల విలువలు పెరగడంతో నిషేధిత భూములకు సైతం రిజిస్ట్రేషన్‌లు చేస్తున్నారనే విషయంపై ఆరాతీశారు. ప్రభుత్వ భూములకు సైతం సర్వే నంబర్లు మార్పుచేసి అక్రమ రిజిస్ట్రేషన్‌లు చేపడుతున్నట్లు గుర్తించారు. ఏసీబీ అధికారి బీవీ సుబ్బారావు మాట్లాడుతూ తనిఖీల్లో లోటుపాట్లు గుర్తిస్తే వెల్లడిస్తామని తెలిపారు. డాక్యుమెంటేషన్‌కు నగదు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అధికారులు అవినీతికి పాల్బడితే 1064 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు. తనిఖీల్లో ఇన్‌స్పెక్టర్లు నాగరాజు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
74 వేలు అదనంగా ఉన్నట్లు గుర్తింపు...
స్థానిక సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు రాత్రి 8 గంటలు అయినా తనిఖీలు కొనసాగిస్తున్నారు. తనిఖీల్లో సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్లకు ఉండాల్సిన నగదు కంటే రూ.74 వేలు అదనంగా ఉన్నట్లు ఏసీడీ డీఎస్పీ బీవీ సుబ్బారావు గుర్తించినట్లు తెలిసింది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సమీపంలో ఉన్న ఓ డాక్యుమెంట్ రైటర్‌ను ప్రశ్నిస్తున్నారు. అక్రమ నగదు ఫోన్‌పే ద్వారా ఎక్కువగా చెల్లించినట్లు విచారణలో అధికారులు తేల్చారు.
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు


