అంతర్ జిల్లాల స్కూల్ గేమ్స్ రెజ్లింగ్ టోర్నీ ప్రారం
విజయవాడరూరల్: చదువుతో పాటు క్రీడలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ఎలాంటి రాత పరీక్షలు లేకుండానే నేరుగా ప్రభుత్వ ఉద్యోగాలు లభిస్తాయని, అందుకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మెగా డీఎస్సీనే చక్కని ఉదాహరణ అని ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (ఐపీఈ) డాక్టర్ ఎస్‌కే మహబూబ్ బాషా అన్నారు. ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్, సమగ్ర శిక్ష, ఎన్టీఆర్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జరిగే అండర్–14,17 బాల,బాలికల రెజ్లింగ్ టోర్నమెంట్‌ను మంగళవారం ఆయన ప్రారంభించారు. విజయవాడ రూరల్ మండలం నున్న జిల్లా పరిషత్ హైస్కూల్ ఆధ్వర్యంలో స్థానిక అశోక్ ఫంక్షన్‌హాల్‌లో అంతర్ జిల్లాల అండర్–14,17 బాల బాలికల ఫ్రీస్టైల్, అండర్–17 బాలుర గ్రీకోరోమన్ రెజ్లింగ్ (కుస్తీ) పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ పోటీలకు 13 జిల్లాల నుంచి సుమారు 750 మంది క్రీడాకారులు, కోచ్‌లు, మేనేజర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మహాబూబ్ బాషా మాట్లాడుతూ రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలలో పాల్గొనే క్రీడాకారులకు అవసరమైన అన్ని రకాల సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తోందన్నారు. కార్యక్రమంలో హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు ఎస్.రవిప్రసాద్, టోర్నమెంట్ పరిశీలకుడు సీహెచ్ రమేష్, సొసైటీ చైర్మన్ కె.శ్రీనివాసరెడ్డి, ఎస్‌ఎంసీ చైర్మన్ గడ్డం కుమార్, ఏపీ రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు జి.భూషణం, టెక్నికల్ ఇన్‌చార్జి పి.ఆనంద్, శాప్ రెజ్లింగ్ కోచ్ కె.మనోహర్, ఎస్‌జీఎఫ్ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి టి.శ్రీలత, ఫిజికల్ డైరెక్టర్ టి.విజయవర్మ, హైస్కూల్ ఫస్ట్ అసిస్టెంట్ గోపీనాఽథ్ పాల్గొన్నారు.


