కళ్ల ముందు నష్టం కనిపిస్తున్నా..
ఆకుమర్రు గ్రామంలో నాలుగున్నరఎకరాల్లో వరి సాగు చేస్తున్నా. తుపానుకు పంటంతా నీటిలో నానుతున్నా పంట నష్టం నమోదు చేయడం లేదు. పొలంలోనుంచి నీరు బయటకు వెళ్లకపోవడంతో పొట్టదశలో ఉన్న పంట చేతికొచ్చే పరిస్థితి లేదు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టం వాటిల్లిన రైతులందరికీ పరిహారం అందేలా చూడాలి.
–ఓడుబోయిన బ్రహ్మకృష్ణ,
రామరాజుపాలెం
మద్దిపట్ల గ్రామంలో ఐదెకరాల్లో వరి సాగు చేస్తున్నా. మోంథా తుపానుకు పంటంతా నేలకొరిగింది. కళ్లముందు పంట నష్టం కనిపిస్తున్నా నమోదు చేయలేదు. ఎందుకు నమోదు చేయడం లేదని అడిగితే ఏఓ గారిని అడగమంటున్నారు.
–డొక్కు నాగమల్లేశ్వరరావు,
తరకటూరు


