అధికారులు సూచికలు ఏర్పాటు చేసినా...
వర్సిటీ భూములు అక్రమంగా అమ్మేసుకుంటున్నారన్న సమాచారం రావడంతో గూడూరు తహసీల్దారు డి.రాజ్యలక్ష్మి సిబ్బందితో అక్కడ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయించారు. అయితే బోర్డులు పెట్టిన ఒకటి, రెండు రోజుల్లోనే వాటిని తొలగించి యథేచ్ఛగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. దీనిపై యూనివర్సిటీ అఽధికారులకు సమాచారం ఇచ్చినా వారు స్పందించడం లేదని, తాము ఏం చేయగలమని రెవెన్యూ అధికారులు అంటున్నారు. ఇప్పటికై నా కృష్ణా యూనివర్సిటీ అధికారులు ఆ భూములను స్వాధీనం చేసుకుని వాటి పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.


