ఎస్‌ఎంసీలో క్లినికల్ ట్రయల్స్‌పై వర్క్‌షాప్
లబ్బీపేట(విజయవాడతూర్పు): మల్టీడిసిప్లీనరీ రీసెర్చ్ యూనిట్ ఆధ్వర్యంలో ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాలలో క్లినికల్ ట్రయల్స్‌పై మూడు రోజుల పాటు నిర్వహించే వర్క్‌షాపు మంగళవారం ప్రారంభమైంది. ఈ వర్క్‌షాపులో వంద మందికి పైగా ప్రతినిధులు పాల్గొనగా, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆలపాటి ఏడుకొండలరావు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఐదుగురు నిపుణులు తమ అనుభవాలను, విలువైన సూచనలను పంచుకున్నారు. వర్క్‌షాపునకు కో ఆర్డినేటర్‌గా డాక్టర్ నవనీతలక్ష్మి వ్యవహరించారు.


