కృష్ణా జిల్లా వ్యవసాయ శాఖ అధికారుల పర్యటన
ఉయ్యూరు రూరల్: కృష్ణా జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు ఉయ్యూరు రూరల్ మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం విస్తృతంగా పర్యటించారు. దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా డీడీఏ జ్యోతి రమణి మాట్లాడారు. ప్రభుత్వ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మోంథా తుపాను కారణంగా నష్టపోయిన పంటలను అంచనా వేసి నివేదిక ప్రభుత్వానికి సమర్పించనున్నామన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పంట పొలాల్లో నీటి నిల్వలు లేకుండా అన్నదాతలు చర్యలు తీసుకోవాలని సూచించారు. పర్యటనలో ఏడీఏ కె. శ్రీనివాసరావు, డీఆర్సీఏఓ పద్మజ, ఎంఏవో నిస్సీగ్రేస్, ఏఈఓ మణిమాల, వీఏఏ సాయికిరణ్ పాల్గొన్నారు.


