భారీ నష్టం మిగిలింది
ఆరెకరాలు కౌలుకు తీసుకుని వరి పంట సాగుచేశా. వర్షంతో పంట నేలవాలింది. భారీగా నష్టం తప్పదు. అధికారులు పూర్తిగా సర్వే చేసి నష్ట పరిహారం అందేలా చూడాలి. ఎందుకంటే ఒక్క గింజ కూడా చేతికి రాదు. పెట్టుబడి మొత్తం పోయినట్టే. కౌలు ఎలా చెల్లించాలో? తలుచుకుంటేనే భయమేస్తోంది.
– మాదు రాజబాబు, కౌలురైతు, గొడవర్రు, కంకిపాడు మండలం
వరుస వర్షాలతో దారుణంగా నష్టపోయాం. వచి ఎకరానికి 4 నుంచి 5 క్వింటాళ్ల దిగుబడి కూడా రావటం లేదు. కూలీలకు కూడా డబ్బులు రాని పరిస్థితి. మిర్చి బాగుందన్న తరుణంలో తుపాను ధాటికి పూత, పిందె రాలిపోయింది. ఇప్పటికే ముసురు వాతావరణంతో పురుగు, తెగుళ్లు వస్తున్నాయి. ప్రభుత్వం పంట నష్టం అంచనా వేసి ఆదుకోవాలి.
– పొన్నం వెంకటేశ్వరరావు, రైతు,
వెంకటాపురం, పెనుగంచిప్రోలు మండలం
25 ఎకరాల్లో పత్తి పంట సాగుచేశా. గత నాలుగు రోజుల క్రితం పత్తి కూలీలతో తీయిద్దామనుకున్నా. తుపాను వస్తోందని అధికారులు హెచ్చరికలు చేశారు. కానీ వర్షం వల్ల చేతికి వచ్చిన పత్తి పూర్తిగా తడిసిపోయింది. కాయ పిందె రాలిపోయింది. చేలల్లో వర్షపునీరు నిలబడ్డాయి. వ్యవసాయానికి చేసిన అప్పులు ఎలా తీరతాయని భయ పడుతున్నా.
– బెల్లంకొండ వెంకట సుబ్బారావు, రైతు గండేపల్లి, కంచికచర్ల మండలం
భారీ నష్టం మిగిలింది
భారీ నష్టం మిగిలింది


