సివిల్స్‌కు ఎంపికై న హార్థిక్ కొఠారి
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): నగరానికి చెందిన హార్థిక్ కొఠారి సివిల్స్ ఫైనల్ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు. పాతబస్తీకి చెందిన ప్రముఖ వ్యాపారి మనోజ్ కొఠారి తనయుడు హార్థిక్ కొఠారి. మనోజ్‌కొఠారి ఏపీ జైన్ కార్పొరేషన్‌కు గతంలో చైర్మన్‌గా పని చేశారు. సివిల్స్ సర్వీసెస్ (మెయిన్స్) పరీక్షలు –2024 ఫైనల్స్ ఫలితాలను యూపీఎస్సీ ఏప్రిల్‌లో ప్రకటించింది. అందులో 1009 మంది ఉత్తీర్ణులైనట్లుగా ప్రకటించింది. మంగళవారం మరో 114 మందిని వివిధ కేటగిరీల్లో ఎంపిక చేస్తూ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌కు సిఫారస్ చేసింది. హార్థిక్ కొఠారి నగరంలోని ఆంధ్ర లయోలా కళాశాలతో పాటుగా బెంగళూర్‌లోని క్రిస్ట్ కళాశాలలో విద్యాభ్యాసం చేశారు. ఈ సందర్భంగా హార్థిక్ కొఠారి ఇంట్లో కుటుంబ సభ్యులు సంబరాలు చేసుకున్నారు. పాతబస్తీలోని పలు జైన్ కుటుంబాలు మనోజ్‌కొఠారి ఇంటికి వెళ్లి వారిని అభినందించాయి.


