ఉరి వేసుకుని యువకుడు ఆత్మహత్య
గన్నవరం: ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని కేసరపల్లిలో శనివారం చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు...కేసరపల్లి ఎస్సీ కాలనీకి చెందిన కూరగంటి సంజయ్(26) పదవ తరగతి వరకు చదివి ఇంటి వద్ద ఖాళీగా ఉంటున్నాడు. ఇంట్లో బీరువాలో ఉన్న రూ.లక్ష నగదును సంజయ్ గప్‌చిప్‌గా తీసుకువెళ్లి స్నేహితులతో కలిసి ఆ నగదును ఖర్చు చేశాడు. ఈ విషయం తెలుసుకున్న తండ్రి వరప్రసాద్ అతనిని తీవ్రంగా మందలించడంతో మనస్తాపానికి గురైన సంజయ్ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై గన్నవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


