నేరాల నియంత్రణలో ఆర్‌పీఎఫ్‌ భేష్‌ | - | Sakshi
Sakshi News home page

నేరాల నియంత్రణలో ఆర్‌పీఎఫ్‌ భేష్‌

Oct 26 2025 6:43 AM | Updated on Oct 26 2025 6:43 AM

నేరాల నియంత్రణలో ఆర్‌పీఎఫ్‌ భేష్‌

నేరాల నియంత్రణలో ఆర్‌పీఎఫ్‌ భేష్‌

నేరాల నియంత్రణలో ఆర్‌పీఎఫ్‌ భేష్‌

రైల్వేస్టేషన్‌(విజయవాడపశ్చిమ): ౖరెల్వే ఆస్తుల పరిరక్షణ, ప్రయాణికుల భద్రత, రైళ్లు, రైల్వేస్టేషన్‌లలో నేరాల నియంత్రణలో విజయవాడ డివిజన్‌ ఆర్‌పీఎఫ్‌ (రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌) మెరుగైన ఫలితాలు సాధిస్తోంది. ఈ నెల 16 నుంచి 24 వరకు విజయవాడ డివిజన్‌ ఆర్‌పీఎఫ్‌ బృందాలు, జీఆర్‌పీ, సీఐబీ బృందాల సహకారంతో ప్రత్యేక డ్రైవ్‌ల ద్వారా పలు కేసులను ఛేదించి నేరస్తులను అరెస్టు చేశారు.

తక్కువ సమయంలోనే

ఛేదించిన కేసుల వివరాలు...

ఆపరేషన్‌ సటార్క్‌లో భాగంగా ఆర్‌పీఎఫ్‌ పోలీసులు సీపీఎస్‌ఆర్‌, కస్టమ్స్‌ అధికారులతో కలసి ఈ నెల 21న విజయవాడ రైల్వేపార్శిల్‌ కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు. దిమాపూర్‌ నుంచి విజయవాడకు ‘ఫుడ్‌ ప్రొడక్ట్‌–మైక్రో కాఫీ’ పేరుతో బుక్‌ చేసిన పార్శిల్స్‌ అనుమానాస్పదంగా ఉండటంతో తనిఖీలు చేపట్టారు. సుమారు రూ. 4.8 లక్షల విలువైన నిషేధిత విదేశీ సిగరెట్లను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకుని కస్టమ్స్‌ అధికారులకు అప్పగించారు.

● ఆపరేషన్‌ యాత్రి సురక్షలో భాగంగా ఈ నెల 12న కాకినాడ స్టేషన్‌లో జరిగిన గొలుసు చోరీ కేసులో ఆర్‌పీఎఫ్‌, జీఆర్‌పీ బృందాలు సీసీ ఆధారాలు లేనప్పటికీ పాత నేరస్తులను విచారించారు. వారి ద్వారా చోరీకి పాల్పడిన దొరబాబును అరెస్టు చేసి అతని వద్ద నుంచి రూ. 16వేల విలువ చేసే బంగారు చైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా పలు చోరీలకు పాల్పడుతున్న చిత్తురుజిల్లా, కుప్పంకు చెందిన నలుగురు పాత నేరస్తులను అరెస్టు చేసి వారి నుంచి రూ.6.6 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. మరో కేసులో ఈనెల 16న రైలు నంబర్‌ 17209లో నిద్రిస్తున్న మహిళ మెడలోని బంగారు చైన్‌ స్నాచింగ్‌పై నమోదైన కేసులో మైలవరానికి చెందిన రావూరి నాగరాజును అరెస్టు చేసి అతని నుంచి రూ.1.10 లక్షల విలువ చేసే 11 గ్రాముల బంగారు చైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. మరో కేసులో ఈ నెల 23న గుడివాడలో రైలు నంబర్‌ 07096లో జరిగిన చోరీ కేసులో నిందితుడు గొరి పర్తి కోటేశ్వరరావును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

రైళ్లలో మొబైల్స్‌ చోరీలో....

ఈ నెల 18న 07229, 16094 నంబర్‌ రైళ్లలో మొబైల్‌ ఫోన్‌ల చోరీలపై నమోదైన కేసులో ఆర్‌పీఎఫ్‌ సిబ్బంది పల్నాడు జిల్లాకు చెందిన దుర్గారావును కావలి స్టేషన్‌లో అరెస్ట్‌ చేసి అతని వద్ద నుంచి రూ. 35వేలు విలువ చేసే రెండు ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు.

ఆపరేషన్‌ నాన్హే షరిష్టేలో భాగంగా...

ఈ నెల 22న తుని రైల్వేస్టేషన్‌లో ఒంటరిగా తిరుగుతున్న తొమ్మిదేళ్ల బాలుడిని, ఈ నెల 21న బాపట్ల రైల్వే స్టేషన్‌లో ఒంటరిగా తిరుగుతున్న 16 ఏళ్ల బాలుడిని గుర్తించిన ఆర్‌పీఎఫ్‌ సిబ్బంది వారిని సంరక్షించి విచారించారు. వారిద్దరిని వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

సురక్షితంగా బంగారు ఆభరణాల

బ్యాగు అందజేత...

ఈ నెల 24న రైలు నంబర్‌ 12664లో హెచ్‌1 కోచ్‌లో రూ.20 లక్షల విలువ చేసే 200 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్న బ్యాగును మర్చిపోయి రైలు దిగిన ప్రయాణికురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విజయవాడ ఆర్‌పీఎఫ్‌ అధికారులు రైలు నెల్లూరు సమీపంలో ఉన్నట్లు గుర్తించి అక్కడ సిబ్బందికి సమాచారం అందించారు. వారు సురక్షితంగా బ్యాగును స్వాధీనం చేసుకుని టీటీఈ సమక్షంలో బంగారు ఆభరణాలు సురక్షితంగా ఉన్నట్లు గుర్తించి ఆమె బంధువులకు అప్పగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement