క్రీడలతో విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

క్రీడలతో విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి

Oct 24 2025 8:06 AM | Updated on Oct 24 2025 8:06 AM

క్రీడలతో విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి

క్రీడలతో విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి

క్రీడలతో విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి

విజయవాడరూరల్‌:క్రీడలు విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి దోహదపడతాయని రాష్ట్ర ఎంఈఓల సంఘం అధ్యక్షుడు ఆదూరి వెంకటరత్నం అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌, సమగ్ర శిక్ష, ఎన్టీఆర్‌ జిల్లా స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో నున్న జిల్లా పరిషత్‌ హైస్కూల్లో మూడు రోజుల పాటు నిర్వహించిన రెజ్లింగ్‌ అండర్‌–19 పోటీలు గురువారం ముగిశాయి. ముఖ్య అతిథిగా విచ్చేసిన మండల విద్యాశాఖాధికారుల సంఘం అధ్యక్షుడు వెంకటరత్నం రెజ్లింగ్‌ పోటీల్లో గెలుపొందిన నెల్లూరు జిల్లా జట్టుకు ఓవరాల్‌ చాంపియన్‌షిప్‌ ట్రోఫీలను, వ్యక్తిగత విజేతలకు పతకాలు అందచేశారు. నెల్లూరు జిల్లా క్రీడాకారులు ఈ టోర్నమెంట్‌ అంతటా అద్భుతమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. ఫ్రీస్టైల్‌ విభాగంలో ఆ జట్టు నాలుగు బంగారు పతకాలను రెండు రజత పతకాలను గెలుచుకోవడం ద్వారా 26 పాయింట్లు సాధించింది. గ్రీకో రోమన్‌ విభాగంలో మూడు బంగారు పతకాలు, మూడు కాంస్య పతకాలతో 18 పాయింట్లు సాధించి ఓవరాల్‌ చాంపియన్‌షిప్‌ను

కై వసం చేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement