వేయి మునులకుదురులో కార్తికమాస పూజలు
అన్ని ఏర్పాట్లు చేశాం
నెలరోజుల పాటు కొండ పై దీపారాధన
పెనమలూరు:యనమలకుదురు గ్రామంలో వేంచేసి ఉన్న పార్వతీ సమేత రామలింగేశ్వరస్వామి దేవస్థానంలో కార్తికమాస పూజలు నెల రోజుల పాటు చేయనున్నారు. కార్తికమాస ఉత్సవాల సందర్భంగా స్వామివారికి భక్తులు అభిషేకాలు నిర్వహించనున్నారు. దీని కోసం ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేశారు. విజయవాడ సమీపంలో యనమలకుదురు గ్రామంలో మునిగిరి అనే పేరు గల కొండ పై శ్రీరామలింగేశ్వరస్వాయివార్ల దేవాలయం కొలువై ఉంది. శివుడు ఇక్కడ శ్రీరామలింగేశ్వరుడిగా ఉన్నట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ ప్రాంతంలో శివుడు స్వయంభువుగా వెలిశాడు. దేవాలయంలో శివుడిని వాయులింగంగా కొలుస్తారు. విష్ణుమూర్తి ఆరవ అవతామమైన పరుశురాముడు ఇక్కడికి వచ్చి తపస్సు చేశాడు. ఆ సమయంలో వేయి మంది మునులు కొలువు తీరి యజ్ఞం నిర్వహించనట్లుగా తెలుస్తోంది. పరుశురాముడు శివలింగాన్ని ప్రతిష్టించి ప్రాణప్రతిష్ట చేశాడని స్థల పురాణం చెబుతుంది. వేయి మంది మునులు తపస్సు చే శారని అప్పటి నుంచి వేయి మునులకుదురు కాలక్రమేనా యనమలకుదురుగా పిలుస్తున్నారు. గ్రామంలో 612 అడుగుల ఎత్తు కొండ పై రామలింగేశ్వర ఆలయం కొలువై ఉంది. కొండ పై వేంచేసి ఉన్న రామలింగేశ్వరస్వామి సన్నిధిలో కార్తిక దీపారాధన భక్తులు చేస్తారు. నాలుగు కార్తిక సోమవారాలతో పాటు, కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున కొండపై దీపాలు వెలిగిస్తారు. భక్తుల సౌకర్యార్థం కొండ పై దీపారాధనకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
కార్తికమాస పూజలకు ప్రత్యేకం....
రామలింగేశ్వర ఆలయ ప్రాంగణంలో ఉన్న నాగేంద్రస్వామివారి ఆలయంలో శనివారం నాగులచవితి పండుగ చేస్తారు. ఈ నెల 27వ తేదీ మొదటి సోమవారం ఉదయం 10 గంటలకు స్వామివారికి శాంతికల్యాణం, నవంబర్ 1వ తేదీవ తేదీన భస్మాభిషేకం, 3వ తేదీ రెండవ కార్తిక సోమవారం శాంతి కల్యాణం, నందీశ్వర అభిషేకం పూజలు నిర్వహిస్తారు. 5వ తేదీ పెద్ద ఎత్తున కార్తిక పౌర్ణమి పూజలు చేసి దీపాలు వెలిగిస్తారు. నవంబర్ 9వ తేదీ పార్వతీదేవి అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా ప్రత్యేకంగా అలంకరిస్తారు. స్వామివారి జన్మ నక్షత్రం ఆరుద్ర నక్షత్రం సందర్భంగా ఉదయం 8 గంటలకు అన్నాభిషేకం, 11 గంటలకు భక్తులకు అన్నసంతర్పన చేస్తారు. 10వ తేదీ మూడవ కార్తిక సోమవారం సందర్భంగా శాంతి కల్యాణం చేస్తారు. 15వ తేదీన స్వామివారికి మారేడు దళాలతో బిల్వార్చన చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. నవంబర్ 17వ తేదీన 4వ కార్తీక సోమవారం సందర్భంగా శాంతి కల్యాణం, సాయంత్రం నందీశ్వర అభిషేకం చేస్తారు. 18వ తేదీ మాసశివరాత్రి ప్రత్యేక పూజలు చేస్తారు. నవంబర్ 21వ తేదీన ఉద్వాసన సందర్భంగా స్వామివారికి అభిషేకం, విశేష అలంకరణ చేస్తారు.
రామలింగేశ్వర సన్నిధిలో దీపారాధన చాలా పవిత్రమైనది. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేశాం. కార్తిక మాసంలో భక్తులు ప్రతి రోజూ దీపారాధన చేయటానికి వసతులు కల్పించాం. నవంబర్ 9వ తేదీ అన్నసంతర్పణ ఉంటుంది. భక్తులు గోత్రనామాలతో అభిషేకం చేసుకోవచ్చు.
– సంగా నరసింహారావు, ఆలయ నిర్మాణ దాత, యనమలకుదురు
వేయి మునులకుదురులో కార్తికమాస పూజలు
వేయి మునులకుదురులో కార్తికమాస పూజలు


