లైంగిక దాడికి పాల్పడ్డ నిందితుడి అరెస్టు | - | Sakshi
Sakshi News home page

లైంగిక దాడికి పాల్పడ్డ నిందితుడి అరెస్టు

Oct 24 2025 8:06 AM | Updated on Oct 24 2025 8:06 AM

లైంగి

లైంగిక దాడికి పాల్పడ్డ నిందితుడి అరెస్టు

లైంగిక దాడికి పాల్పడ్డ నిందితుడి అరెస్టు ఏపీ హెచ్‌డీసీ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ ప్రమాణస్వీకారం అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్‌ జిల్లా అధ్యక్షుడిగా మురళీకృష్ణ

ఉయ్యూరు: బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. పోలీసుస్టేషన్‌ నుంచి నిందితుడిని ముసుగు తొలగించి నడిపించుకుంటూ కోర్టుకు తీసుకెళ్లి హాజరు పరిచారు. న్యాయమూర్తి శ్రీహరి 14 రోజులు రిమాండ్‌ విధిస్తూ తీర్పునిచ్చారు. న్యాయస్థానం ఆదేశాలతో నిందితుడు చాన్‌బాషాను నెల్లూరు జైలుకు తరలించారు. గన్నవరం డీఎస్పీ చలసాని శ్రీనివాసరావు స్థానిక పోలీసుస్టేషన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఘటన వివరాలు వెల్లడించారు. ఉయ్యూరులోని కాపుల రామాలయం ప్రాంతంలో షేక్‌ చాన్‌బాషా నివాసం ఉంటున్నాడు. గ్యాస్‌స్టవ్‌లు రిపేర్లు చేస్తూ తాపీ కార్మికుడుగా పని చేస్తున్నాడు. తన ఇంటి వద్దకు రోజూ ఆడుకునేందుకు వచ్చే ఎనిమిదేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. చాక్లెట్లు ఆశ చూపి పైశాచికానందం పొందుతున్నాడు. విషయం ఎవరికై నా చెబితే చంపేస్తానని బెదిరించాడు. ఈ క్రమంలోనే ఈ నెల 21న ఆయన ఇంటికి వచ్చిన బాలిక పెద్దగా కేకలు వేయటంతో ఇరుగుపొరుగు వచ్చి నిందితుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. దీంతో దారుణం వెలుగు చూసింది. నిందితుడు బాలికకు వరుసకు మామయ్యే. ఘటనపై జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌ నాయుడు తీవ్రంగా స్పందించటంతో డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ రామారావు వేగంగా దర్యాప్తు చేపట్టి ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడిపై ఫోక్సో చట్టంతో పాటు పలు సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు.

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): ఆంధ్రప్రదేశ్‌ హ్యాండీక్రాప్ట్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ సంస్థ (ఏపీహెచ్‌డీసీ) డైరెక్టర్స్‌గా గంగళ్ల జీవిత, పొగాకుల సోమ శేఖర్‌, పుట్టం శ్రీనివాసరెడ్డి, ఆర్డీఎస్‌ ప్రసాద్‌ నియమితులయ్యారు. వీరు గురువారం గాంధీనగర్‌లోని ఏపీ హ్యాండీక్రాప్ట్స్‌ కార్యాలయంలో పదవీ ప్రమాణం చేశారు. సంస్థ చైర్మన్‌ డాక్టర్‌ పసుపులేటి హరిప్రసాద్‌, వైస్‌ చైర్మన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎం.విశ్వం ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. అనంతరం నూతన డైరెక్టర్లను అభినందించారు.

భవానీపురం(విజయవాడపశ్చిమ):అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్‌ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడిగా భవానీపురానికి చెందిన బొడ్డు మురళీకృష్ణ నియమితులయ్యారు. ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు కోనా శ్రీనివాసరావు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంట్ల రామమోహన్‌రావు గురువారం మురళీకృష్ణకు నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మురళీకృష్ణ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా పర్యటించి ఆర్య వైశ్య ఫెడరేషన్‌ను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు. ఇబ్బందుల్లో ఉన్న ఆర్య వైశ్యులను ఆదుకుని తగిన భరోసా కల్పిస్తానని తెలిపారు. ఇప్పటికే వాసవి క్లబ్‌ అంతర్జాతీయ కో ఆర్డినేటర్‌గా పని చేస్తూ గ్రామీణ ప్రాంతాల్లోని వాసవి సభ్యులు, పేదలకు వివిధ రూపాల్లో తోడ్పాటు అందిస్తున్నానని పేర్కొన్నారు.

లైంగిక దాడికి పాల్పడ్డ నిందితుడి అరెస్టు 1
1/1

లైంగిక దాడికి పాల్పడ్డ నిందితుడి అరెస్టు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement